తెలంగాణ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ,జూన్2(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సోదర సోదరీమణులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుంభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని ఆశిస్తున్నట్లు మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.