తెలంగాణ ప్రజల మనోభావాలు పట్టించుకోకపోవడం వల్లే రాజీనామా
-కడియం శ్రీహరి
వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పడం లేదని ఆ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఈ ఉదయం పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల మనోభావాలను పార్టీ పట్టించుకోకపోవడం వల్లే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే… ప్రజా ఉద్యమాల్లో పాల్గొనడంలో పార్టీ విఫలమవడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.