తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం
– ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం
– కాళోజీ జయంతిన ఇలా ప్రజా ప్రయోజన కార్యక్రమము జరుపుకోవడం అద్భుత ఘట్టం – లబ్ధిదారులకు సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం
– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ సెప్టెంబర్ 9 (జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శమని, ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
శుక్రవారం హుజూర్ నగర్ పట్టణం లోని టౌన్ హాల్లో జరుగుతున్న సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సైదిరెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి తమ స్వహస్తాలతో నియోజకవర్గంలోని ఏడు మండలాలు, రెండు మునిసిపాలిటీల లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ చరిత్రలోనే ఇంతవరకు ఇలాంటి కార్యక్రమాన్ని గడచిన 25 ఏళ్లలో ఎవరు ఎన్నడూ ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. కాళోజి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం నిజంగా ఒక అద్భుత ఘట్టమని తెలియజేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే ఆఫీస్ ద్వారాగా ప్రభుత్వానికి సుమారు ఒక 100 సిఎంఆర్ ఫైల్స్ ని సమర్పించి, ప్రభుత్వం ద్వారా అప్రూవల్ చేపించి తిరిగి ప్రజలకు ఇప్పించడం జరుగుతుందన్నారు. ఈ విధంగా ప్రతినెల సుమారు కోటి రూపాయల సీఎంఆర్పి చెక్కులను నియోజకవర్గంలోని ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు.
ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఇక్కడికి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క కష్టాలను, వారి జీవన విధానాన్ని తెలిసినటువంటి వ్యక్తిగా ఆసుపత్రికి వెళితే ఎంత ఖర్చవుతుందో ఆపద వస్తే ఎలాంటి ఇబ్బందులు గురి అవుతాయో స్పష్టంగా తెలిసిన వాళ్ళం కనుక ఈ విధంగా ప్రజలకు తిరిగి సీఎంఆర్ పథకం ద్వారా ఆసుపత్రికి ఖర్చులను బిల్లులను తిరిగి ప్రభుత్వం ద్వారా ఇప్పించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాలు ఇలాంటి ప్రజాప్రయోజనమైన పనులు ఏనాడు కూడా చేసి ఎరగరు అన్నారు. కొంతమంది దళారులు దొంగ ఆసుపత్రి బిల్లుల ద్వారా సీఎంఆర్ఎఫ్ దొంగ ఫైల్స్ ని సబ్మిట్ చేయడం జరుగుతుందని తెలుసుకొని అట్టి ఫైల్స్ ని ఆపివేసి అటువంటి వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని శాసనసభ్యులు సైదిరెడ్డి తెలియజేశారు. ఎన్నో వేదికల మీద ప్రతిపక్ష పార్టీలకు ఎన్నోసార్లు విన్నపాలు చేశాము అభివృద్ధిని అడ్డుకోవద్దు, ప్రజలను కష్టాల గురి చేయొద్దు కోర్టులో కేసులు వేయొద్దు, అవినీతి జరిగితే జైల్లో పెట్టండి అని కూడా వారికి ఎన్నోసార్లు విన్నపాలు చేశామన్నారు. త్వరలోనే కోర్టు కేసులను కూడా ఛేదించుకొని అన్ని పనులను పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని తెలియజేశారు. లబ్ధిదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథరెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, మఠంపల్లి ఎంపీపీ పార్వతీకొండ నాయక్, మఠంపల్లి జడ్పిటిసి జగన్ నాయక్, టిఆర్ఎస్ నాయకులు సోమగాని ప్రదీప్, ఎడ్ల విజయ్, సైదులు, నరసింహారావు, కౌన్సిలర్లు, వివిధ మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, నియోజకవర్గంలోని ఏడు మండలాల, రెండు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.