తెలంగాణ ప్రభుత్వం లోనే ఆడపడుచులకు సముచిత గౌరవం…
జనగామ జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి
బచ్చన్నపేట సెప్టెంబరు 26 (జనం సాక్షి)
ఆడపడుచులకు ఎన్నడు లేని విధంగా సముచిత గౌరవం ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని జనగామ జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య అన్నారు. సోమవారం మండలంలోని చిన్న రామ చర్ల గ్రామపంచాయతీ సర్పంచ్ కలీన బేగం ఆజాం తో కలిసి బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆడపడుచులు పూలను దేవునిగా ప్రకృతిని దైవంగా పూజించే రాష్ట్రం భారతదేశంలో ఎక్కడ లేదని ఒక్క తెలంగాణలోనే ఉన్నదని అలాంటి తెలంగాణలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులను తన సొంత తోబుట్టువులుగా గౌరవిస్తూ ప్రతి ఇంటి ఆడపడుచుకు చీర అందించి రాష్ట్రంలో కోటికి పైగా చీరలు పంపకాలు జరిగిందన్నారు. అంతేకాకుండా స్వరాష్ట్రంలో చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ సమాజంలో తలెత్తుకుని బ్రతికేలా చేసిన ఘనత కేసిఆర్ కే దక్కిందన్నారు. ఆడపడుచుల పెళ్లిళ్లకు కళ్యాణ్ లక్ష్మి. షాది ముబారక్. కెసిఆర్ కిట్టు ఇచ్చి ప్రతి ఇంటి కుటుంబానికి పెద్దన్నగా ఉన్నాడని ఆమె తెలిపారు. బోన కొల్లూరు సర్పంచ్ ఐలు మల్లు. బసిరెడ్డిపల్లి సర్పంచ్ బాలగోని పరశురాములు. లింగంపల్లి సర్పంచ్ మల్లేష్. గంగాపురం సర్పంచ్ సుశీల. నారాయణపురం సర్పంచ్ మాసాపేట రవీందర్ రెడ్డి. సాల్వాపూర్ సర్పంచ్ కీసర లక్ష్మి. కొన్నే సర్పంచ్ వేముల వెంకటేష్ గౌడ్. ఆయా గ్రామాల ఎంపీటీసీలు డీలర్లు కార్యదర్శి తో కలిసి చీరలు పంపిణీ చేయడం జరిగింది