తెలంగాణ ప్రజలకు మీ ప్రేమ కావాలి : కేసీఆర్
ఆహ్వానించిన వెంటనే ప్రధాని ఒప్పుకుని రాష్ట్రానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రజలకు మీ ప్రేమకావాలి అంటూ సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణపై ఇప్పటివరకు అండగా ఉన్నందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు సీఎం. తెలంగాణ రాష్ట్రంలో గతంలో మూతపడిన రామగుండం ఫర్టిలైజర్ కార్పోరేషన్‌ను తిరిగి ప్రారంభించేందుకు అనుమతినిచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ప్రజానీకం ధన్యవాదాలు తెలుపుతోందన్నారు. రాష్ట్రానికి హడ్కో రుణాలు వచ్చేలా సాయం చేసిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. నీళ్లు,నిధులు,ఉద్యోగాల కోసమే ఉద్యమం చేశామని ఆయన గుర్తు చేశారు. ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని మోడీకి విజ్ఞప్తి చేశారు కేసీఆర్. మనోహరబాద్-కొత్తపల్లి రైల్వేలైను ఎన్నో ఏళ్ల కళ అని వివరించారు. మిషన్ కాకతీయకు కేంద్ర సహకారం కావాలన్నారు కేసీఆర్. అవినీతి లేని కేంద్రప్రభుత్వాన్ని తొలిసారిగా తన రాజకీయ జీవితంలో చూస్తున్నానని కేసీఆర్ అన్నారు.