తెలంగాణ బియ్యం తెలంగాణ ప్రజలకే అమ్మొచ్చు
ఢల్లీిలో పారబోసే బదులు కిలో పదికి అమ్మితే పేదలకు మేలు
బియ్యంపై రాజకీయాలు మాని రైతుల సమస్య తీర్చాలి
హైదరాబాద్,డిసెంబర్25(జనం సాక్షి): బియ్యం సేకరణపై టిఆర్‌ఎస్ నేతల కయ్యం పెద్దగా ఫలించిన దాఖలాలు కానరావడం లేదు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం టిఆర్‌ఎస్ నేతలను ఓ లెక్కలోకి తీసుకున్నట్లుగా లేదు. దీనికితోడు బియ్యం సేకరణపై రాతపూర్వకహావిూ అంటూ పట్టుపట్టిన మంత్రలు బృందం అభాసు పాలయ్యింది. పార్లమెంట్ వేదికగానే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటన చేశాక ..మరో ప్రకటన లేదా కాగితం రాసివ్వడం అన్నది జరగదు. ఇది టిఆర్‌ఎస్ నేతలకూ తెలుసు.అయినా కావాలనే వీరంతా యాగీ చేశారని ప్రజలకు ముఖ్యంగా రైతులకు కూడా అర్థం అయ్యింది. నిజానికి బియ్యం అంటే రా రైస్ ఎంతయినా కొంటామని కేంద్రం చెప్పిన దరిమిలా అందుకు తగ్గట్లుగా మంత్రలు బృందం వ్యూహాత్మకంగా వ్యవహరించి, కేంద్రాన్ని ఒప్పించి ఉంటే బాగుండేది. కానీ కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేసలా.. తెలంగాణ బిజెపి నేతలు తెలంగాణ ద్రోహులు అన్నట్లుగా చిత్రీకిరించే ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టాయనే చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం సేకరించిన మొత్తం బియ్యాన్ని కేంద్రం తీసుకోవాల్సిందేనని మంత్రుల బృందం తేల్చడం ఒక ఎత్తయితే..బియ్యం అంటే ఉప్పుడు బియ్యం అని చెప్పడమే సరికాదు. బియ్యం తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని, ఈ వ్యవహారాన్ని ఇంకా పొడిగిస్తే మంచిది కాదని హెచ్చరించింది. కేంద్రం రైతులను తీవ్రంగా అవమానించేలా వ్యవహరిస్తోందని మండి పడిరది.’రాష్ట్రం సేకరించిన మొత్తం బియ్యాన్ని తీసుకోకుంటే, మిగిలిన బియ్యాన్ని ఢల్లీిలోని ఇండియాగేట్ వద్ద పారబోసి నిరసన తెలుపుతాం అని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. నిజానికి బియ్యం ఢల్లీిలో పారబోసే బదులు ఇక్కడి పేదలకు రేషన్ షాపుల ద్వారా కిలోకి 5లకు ఇచ్చినా తీసుకుంటారు. ఇందుకు ఇప్పటికైనా సమయం మించలేదు. ధాన్యం మొత్తంగా సేరకరించి కార్డులు లేని వారందరికీ కిలో 5కు లేదా పదికి అమ్మితే ప్రయోజనం ఉంటుంది. ప్రలజంతా కెసిఆర్ వెంట నడుస్తారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టి చివరిగింజ వరకు కొంటామన్న హావిూని నెరవేర్చాలి. ఇప్పటికే 60 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి ధాన్యం సేకరించామని చెప్పారు. రైతుల సంక్షేమం దృష్ట్యా ఉన్నఫళంగా ధాన్యం సేకరణను ఆపేయలేమని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి పూర్తిగా కొనుగోలు చేస్తుందని స్పష్టం చేసినందున ..సేకరించిన ధాన్యాన్ని పేదలకు తక్కువ ధరలకు అందించాలి.యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెప్పినందున వచ్చే యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండబోవని మంత్రులు, అంతకు ముందు సిఎం కెసిఆర్ చెప్పారు. ఇలా పదేపదే ఇదే విషయాన్ని చెప్పడం ద్వారా తెలంగాణ అన్నపూర్ణ అని చెప్పడానికి లేకుండా చేస్తున్నారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఇద్దరూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వారిపై ఎదురుదాడి చేయడం వల్ల వచ్చే ప్రయోజనం కూడా లేదని మంత్రులు గమనించాలి. రాజకీయంగా ధాన్యం సేకరణ అంశం పనిచేయదని కూడా గమనించాలి.