తెలంగాణ భవన్ ఏర్పాటుకు ఎకరం స్థలం: డీపీఆర్ సిద్ధం చేయండి

తహశీల్దార్లకు కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశం

తెలంగాణ భవన్ ఏర్పాటులో మరో కీలక ముందడుగు

హర్షం వ్యక్తం చేసిన కేఆర్టీఏ అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల

డీపీఆర్ సిద్ధం చేసే ప్రక్రియలో తెలంగాణ వాసుల నుంచి సలహాల ఆహ్వానం

హైదరాబాద్, జూలై 30, 2018:

కర్ణాటలో తెలంగాణ న్ ఏర్పాటులో మరో కీలక ముందడుగు పడింది. న్న రాష్ట్ర తెలంగాణ  అసోసియేషన్  (కేఆర్టీఏ) బృందం చేసిన కృషి ఫలించి తెలంగాణ న్ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున కీలక ఆదేశం వెలువడింది. బెంగళూరు పరిధిలో తెలంగాణ భవన్ ఏర్పాటుకు ఎకరం స్థలం చూడటంతో పాటుగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేయాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నగర పరిధిలోని తహశీల్దార్లను ఆదేశించారు. తెలంగాణ భవన్ ఏర్పాటు కల నెరవేరేందుకు కీలక ముందడుగు పడిన నిర్ణయం పట్ల కేఆర్టీఏ వ్యస్థాప అధ్యక్షుడు సందీప్ కుమార్ క్తాల హర్షం వ్యక్తం చేశారుకర్ణాటకలోని తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్రంలో తెలంగాణ ఉనికిని తెలియజెప్పేందుకు న్న రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ (కేఆర్టీఏ) తెలంగాణ ఉద్యమ సమయం నుంచే పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇటీవల జరిగిన కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సందర్భంగా భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలను కలిసి తెలంగాణ భవన్ ఏర్పాటు ప్రతిపాదనను ఉంచింది. మాజీ ప్రధాని, తాదళ్ సెక్యులర్ (జేడీఎస్)ను కేఆర్టీఏ బృందం కలిసిన సందర్భంగా పార్టీ అధినేత దేవేగౌడ తెలంగాణ న్ను నిర్మిస్తామనే హామీని ఇస్తూ ఎన్నిక మ్యానిఫెస్టోలో ఉంచనున్నట్లు తెలుపడమే కాకుండా మేరకు పొందుపర్చారు. తద్వారా తెలంగాణ భవణ్ ఏర్పాటులో తొలి ముందడుగు పడింది. ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం జేడీఎస్ నేత, ముఖ్యమంత్రి కుమారస్వామి ఇందుకు తగు నిర్ణయం తీసుకున్నారుబెంగళూరులో తెలంగాణ భవన్ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మేరకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నగరంలోని దక్షిణ బెంగళూరు, ఉత్తర బెంగళూరు, అనేకల్ తాలూకా తహశీల్దార్లకు తెలంగాణ భవన్ ఏర్పాటుకు ఎకరం స్థలం అన్వేషించాలని, డీపీఆర్ సిద్ధం చేయాలని, ఇందులో కేఆర్టీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల సలహాలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.   మేరకు అధికారులు పక్రియ మొదలుపెట్టారు నిర్ణయం పట్ల సందీప్ కుమార్ మక్తాల హర్షం వ్యక్తం చేశారు. జేడీఎస్ మ్యానిఫెస్టోలో పెట్టడం తొలి విజయం కాగా ఇది మరో కీలక అడుగు అని వివరించారు. జేడీఎస్ రథసారథి దేవేగౌడ, సీఎం కుమారస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేవేగౌడతో సమావేశం సందర్భంగా విషయం ప్రస్తావించడం ప్రక్రియకు మరింత వేగం పెంచిందని సంతోషం వ్యక్తం చేశారు.తెలంగాణ ఉద్యమం సమయంలో బోనాలు, బతుకమ్మ సహా ఇతరత్రా ఏవైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే స్థలం దొరికేది కాదని అలాంటి స్థితి నుంచి బెంగళూరులో మహానగరంలో తెలంగాణ భవన్ ఏర్పాటుకు ఎకరం స్థలం కేటాయించేలా నిర్ణయం వెలువరించడం గొప్ప ముందడుగు అన్నారు. తెలంగాణకు, కర్ణాటకకు సంస్కృతి పరంగా 9 శతాబ్ధం నుండి అనేక అంశాల్లో సారుప్యత ఉందన్నారు. తెలంగాణలోని బోధన్లో జన్మించి, కన్నడలో మహకవిగా గుర్తింపు పొందిన పంపన ఎన్నో రచనలు చేశారని సందీప్ కుమార్ మక్తాల తెలిపారు.  పంపన తెలంగాణ భవన్ పేరుతో భవనం నిర్మించనున్నామన్నారుఐటీలో ఉద్యోగాల కోసం, ఉన్నత ఉద్యోగం కోసం వెళ్లినపుడు రాష్ట్రంలో తమ వాళ్లు ఎవరూ లేరనే భావనతో మన ప్రజలు ఉంటారని, అలాంటి వారికి తెలంగాణ భవన్ మన ఇల్లు వంటి ధైర్యం కల్పిస్తుందని సందీప్ కుమార్ మక్తాల వెల్లడించారు. నగరానికి కొత్తగా వచ్చిన వారికోసం, ఎలాంటి పరిచయం లేని వారికోసం తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేయాలనే ప్రతిపాదన ఉందని  తెలిపారు. దీంతోపాటుగా లైబ్రరీ, టౌన్ హాల్ వంటివి సైతం ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉన్నామన్నారు. బతుకమ్మ, బోనాలు, ఆవిర్భావ వేడుకలు చేసుకునేందుకు తగు రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామని సందీప్ కుమార్ మక్తాల  అన్నారు. వారం నుంచి అధికారులతో సమన్వయం చేసుకొని వేగంగా ముందుకు తీసుకుపోనున్నట్లు వివరించారు. డీపీఆర్ ను సిద్ధం చేసే క్రమంలో మరింత పకడ్బందీగా, ఫలవంతంగా ఉండేందుకు సలహాలు ఇవ్వాలని సందీప్ కుమార్ తెలిపారు.  [email protected]  కు తమ అభిప్రాయలను తెలియజేయవచ్చన్నారు.