తెలంగాణ మండలికాన్ని ప్రజల జీవితాన్ని కథలుగా మలిచిన గూడూరి..

అఖిలభారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జూకంటి జగన్నాథం.

కథ రచయిత గూడూరి సీతారాం జయంతి సందర్భంగా నివాళులు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 18.(జనంసాక్షి). తెలంగాణ మండలికాన్ని ప్రజల జీవితాన్ని కథలుగా మలిచిన తొలి తరం కథ గూడూరు సీతారాం సాహిత్యానికి అందించిన సేవలు మరువలేనివాని అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జూకంటి జగన్నాథం అన్నారు. మంగళవారం తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో గూడూరు సీతారాం 87వ జయంతి సందర్భంగా పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద సీతారాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఖిలభారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జూకంటి జగన్నాథం, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ సిరిసిల్ల ప్రాంతం నుంచి ఎదిగోచ్చినా తొలితరం రచయిత గూడూరు సీతారాం తన కథల ద్వారా తెలంగాణ మండలికానికి వన్నెతేవడమే కాకుండా ప్రజల జీవితాలను అనేక కోణాల్లో ఆవిష్కరించారని తెలిపారు. తెలుగు సాహిత్యానికి గూడూరి సీతారాం అందించిన సేవలు మరువలేనివని అన్నారు. తెలుగు సాహిత్యంలో గూడూరు సీతారాం ప్రత్యేక ముద్ర వేసారని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర నాయకులు ఆడేపు లక్ష్మణ్,, టివి నారాయణ, డాక్టర్ జనపాల శంకరయ్య, వెంగళ లక్ష్మణ్, సిరిసిల్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.