తెలంగాణ మీడియాపై సీమాంధ్ర సర్కారు వివక్ష

ప్రధాని పర్యటన కవరేజ్‌ టీ మీడియాకు అనుమతి నిరాకరణ
రాజ్యాంగ విరుద్ధ వైఖరిని ప్రదర్శించిన ప్రభుత్వం
భగ్గుమన్నతెలంగాణ వాదులు
సర్కారు వైఖరిని నిరసిస్తూ జర్నలిస్టులు, తెలంగాణవాదులధర్నా
ప్రధానిని కలిసేందుకు వెళుతున్న టీ జేఏసీ నేతల అరెస్ట్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌ 16 (జనంసాక్షి) :
జీవ వైవిధ్య సదస్సు వేదికగా సీమాంధ్ర దురహంకారం మరోసారి బయటపడిం ది..తెలంగాణపై సీమాంధ్ర సర్కారు తన కుటిల బుద్దిని ప్రదర్శిం చింది..జీవ వైవిద్య సదస్సు నేపధ్యంలో ప్రధాని పర్యటన సందర్భంగా తెలంగాణ మీడియాకు అనుమతించకుండా తన వివక్షను బయట పెట్టుకుంది. తెలంగాణ లోనే తెలంగాణ పౌరులుగా ప్రకటిం చిది…సీమాంధ్ర మీడియా మాత్రమే మీడియా అయినట్లు తెలంగాణ మీడియా అసలు మీడియానే కాదన్నట్టు ప్రవర్తించింది..తెలంగాణవారికి మీడియా నడిపే హక్కు లేదన్నట్లుగా వ్యవహరించింది…ఒక ప్రాంతం వారికి మాత్రమే ప్రధాని పర్యటనక అనుమతిం చి..తెలంగాణ వారిని అనుమతించక పోవడం రాజ్యాంగ విరుద్ధం…ఒక ప్రాం తంలోని మీడియాను ప్రధాని పర్యటనకు అనుమతించ కపోవడం అప్రజాస్వామికం కాదా…ఈ సంఘటనతో సీమాంధ్ర సర్కారు తెలంగాణ మీడియాను దారుణం గా అవమానిం చింది..దీనిని సర్కారు ఏ విధంగానూ సమర్ధించుకో లేదు..అడుగుకో
విచక్షణ కోల్పోయి..వివక్ష చూపింది..తెలంగాణకు చెందిన నమస్తే తెలంగాణ, టీ న్యూస్‌, వి6, హెచ్‌ఎంటీవీ తదితర చానెళ్ల ప్రతినిధులను అనుమతించమని చెప్పడం దారుణమైన విషయం..ఓ ప్రభుత్వానికి ఎలాంటి పక్షపాత ధోరణి ఉండకూడదు..పాలకులు గద్దెనెక్కేటపుడే ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా తమ విద్యుక్త ధర్మం నిర్వహిస్తామని భారత రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేస్తారు..అలాంటి పాలకులు తాము చేసిన బాసలు మరిచి ఒక ప్రాంతానికే ఎలా పరిమితం అవుతారు..పాలకులకు ప్రాంతీయ బేధం ఉండొద్దన్న విషయం మరిచి తెలంగాణపై వివక్ష చూపడం దేనికి సంకేతం…
తెలంగాణ జర్నలిస్టుల నిరసన
ప్రధాని పర్యటన నేపధ్యంలో ఆయన పాల్గొనే కార్యక్రమాల కవరేజికి సంబంధించి అన్ని మీడియా ప్రతినిధులలాగే ప్రధాని పర్యటనకు దరఖాస్తు చేసుకున్న తెలంగాణ మీడియా ప్రతినిధులకు అనుమతివ్వలేదు..అయితే మామూలుగా కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులను పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో వారు ఆందోళనకు దిగారు..మిగతా వారిని అనుమతించి తమను అనుమతించకపొవడమేంటని నిలదీశారు.. దీనిని నిరసిస్తూ సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు..ఈ సందర్భంగా ఓ చానెల్‌ కెమెరామెన్‌కు సైతం గాయాలయ్యాయి..వీరికి మద్ధతు తెలపిన తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ, తెలంగాణ జేఏసీ, కోదండరాం, టీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావులు అనంతరం ప్రధాని పర్యటనను అడ్డుకొనేందుకు బేగంపేట ఏర్‌పోర్టు వైపు వెళ్లుతుండగా పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు…అక్కడే దీక్షను కొనసాగిస్తున్న జర్నలిస్టుల కుమద్ధతుగా కోదండరాం, తదితరులు దీక్షలోనే కూర్చొన్నారు..
అప్రజాస్వామికం…కోదండరాం
సీమాంధ్ర సర్కారు తెలంగాణ మీడియాపై వివక్ష చూపడం అప్రజాస్వామికమని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం మండిపడ్డారు..తెలంగాణ జర్నలిస్టులు చేస్తున్న నిరసన తెలిపిన అనంతరం బేగంపేట ఏర్‌పోర్టువైపు వెళ్తున్న ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు..ఈసందర్భంగా నాంపల్లి పీఎస్‌లో దీక్ష కోనసాగిస్తున్న జర్నలిస్టులకు ఆయన మద్ధతు తెలిపారు..సీమాంద్ర మీడియాకు అనుమతిచ్చి తాను సీమాంధ్ర సీఎం అన్న విషయాన్ని మరోసారి కిరణ్‌కుమార్‌ నిరూపించుకున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..సీమాంధ్ర తన కుటిల బుద్ధిని మరోసారి బయటపెట్టుకున్నదని మండిపడ్డారు..సీఎం రెండు ప్రాంతాల వారిని విడగొట్టారని, సీమాంధ్ర సర్కారు తెలంగాణ వాదం ప్రధానికి వినపడకుండా చేసేందుకు కుటిల యత్నాలు చేస్తోందంటూ నిప్పులు చెరిగారు..ఇంత జరిగినా మంత్రి డికె అరుణ ఈ విషయాన్ని ఖండించకపోవడం బాధాకరమన్నారు.
ధ సర్కారు కుటిల యత్నాలు బయటపడ్డయి…మంగళవారం జీవ వైవిద్య వేదికపై ప్రధాని ప్రసంగ కార్యక్రమానికి తెలంగాణ జర్నలిస్టులకు, తెలంగాణ ప్రాంతానికి చెందిన మీడియా ప్రతినిధుల కవరేజికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది..తెలంగాణపై తేల్చకుండా ప్రధాని హైద్రాబాద్‌లో పర్యటిస్తే అడ్డుకుంటామని హెచ్చరించడంతో భయపడిన సీమాంధ్ర సర్కారు తెలంగాణ జర్నలిస్టులు ఎక్కడ గొడవ చేస్తరో అని జడుసుకుంది..దీంతో తెలంగాణవాదులను కవరేజికి అనుమతించలేదు..దీంతో తెలంగాణ జర్నలిస్టులు దీనిపై మండిపడ్డరు..తెలంగాణ ప్రాంతం వారిని అనుమతించకుండా, సీమాంధ్ర మీడియా ప్రతినిధులను అనుమతించడమేంటని వారు ప్రశ్నించారు. సీఎం రెండు ప్రాంతాల వారిని విడగొట్టారని, సీమాంధ్ర సర్కారు తెలంగాణ వాదం ప్రధానికి వినపడకుండా చేసేందుకు కుటిల యత్నాలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి మంత్రి డీకె అరుణ సమాధానం చెప్పాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నాయకులు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు మీడియా ప్రతినిధులను అరెస్ట్‌ చేసి నాంపెల్లి పీఎస్‌కు తరలించారు. అయితే వారు అక్కడ కూడా తమ నిరసన కొనసాగిస్తున్నారు..వీరికి టీ అడ్వకేట్‌ జేఏసీ కూడా మద్ధతు పలికింది..అయితే రెండు ప్రాంతాల వారిని విడగొట్టి, కేవలం సీమాంధ్ర ప్రాంతం వారికి అనుమతి ఇచ్చారని, అదే విధంగా తాము కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని కూడా విడగొట్టినట్టయితే బాగుంటుంది కదా అని వారు సీఎంకి సూచించారు.