తెలంగాణ మీ జాగీరా?

6

మాజీ  ఎంపీ  పొన్నం  ప్రభాకర్‌

హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి):

తెలంగాణ ముఖ్యమంత్రి కొన్ని గ్రామాలను మాత్రమే ఆదర్శంగా తీసుకుంటున్నారని, అలాకాకుండా మొత్తం రాష్ట్రాన్ని  ఆదర్శంగా తీర్చిదిద్దాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విూడియాతో మాట్లాడుతూ  రైతాంగం పట్ల ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.ఇది ప్రజాస్వామ్యం.. సొంత నిర్ణయాలు తీసుకోవడానికి.. తెలంగాణ ఏమె ౖనా కేసీఆర్‌ జాగీరు కాదు..’ అని పొన్నం ప్ర భాకర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  ఎవరు అడ్డుపడ్డా ఇరిగేషన్‌ ప్రాజెక్టులను రీడిజైన్‌ చేస్తానని కేసీఆర్‌ మా ట్లాడుతున్న తీరును తప్పు పట్టారు.  కేసీఆర్‌ దేమైనా రాజరికమా..? లేక జమిందార్‌ పాలనా? అని నిలదీశారు. తెలంగాణ కేసీ ఆర్‌ జాగీరు కాదని, ప్రాజెక్టులపై అఖిల పక్షంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పొన్నం డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ను నిందిస్తున్న కేసీఆర్‌.. కాంగ్రెస్‌, టీడీపీ, వామపక్షాలతో పొత్తు పెట్టుకు న్నప్పుడు ప్రాజెక్టులపై అప్పుడెందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. కేసీఆర్‌, మంత్రులు తుగ్లక్‌ను తలపిస్తున్నారని విమ ర్శించారు. రైతులపట్ల నిర్లక్షం వహిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రానున్న రోజుల్లో అం దుకు తగినమూల్యం చెల్లించుకోక తప్పదని పొన్నం హెచ్చరించారు.