తెలంగాణ ముస్లిం సాహిత్యం తెలంగాణలో జాతీయోద్యమం-ముస్లింలు
కంటింజెంట్ సైన్యం 1858 సంవత్సరం మొత్తం రోహిల్లా తిరుగు బాటల్ని అణచివేస్తున్న సమయంలోనే రంగారావు, రాజా దీప్‌సిం గ్‌తో పాటు 1000 మంది సైన్యాన్ని సమకూయకర్చుకుని పెద్ద ఎత్తు న తిరుగుబాటుకు పథక రచన మరో స్వాతంత్య్రాబిలాషి సప్దరు ద్దౌలా అయితే ఇది కార్యరూపం ధరించకముందే ఆంగ్లేయులు వీరి ని అరెస్ట్ చేసినారు. సప్దలుద్దౌలాకు జీవితశిక్ష వేసి ఆస్తిని స్వాదీనం చేసుకున్నారు. ఆంగ్లేయులతో పాటు వారికి వత్తాసు పలికిన సాలా ర్జంగ్ మీద కూడా ప్రజలు కసిని పెంచకున్నారు.
1859 మార్చి 15న గవర్నర్ జనరల్ తరపున కల్నల్ డేవిడ్సన్ నిజాంకు కానుక ఇవ్వడానికి వెలఙ్ల సాలార్జంగ్‌తో తిరిగి వస్తుండగా రొహిల్ఖండ్ పటాన్ జహంగీర్‌ఖాన్ వీరిద్దరి మీదా దాడి చేసినాడు. తృటిలో వాళ్లు ప్రాణాలతో బయట పడ్డారు. ఆ ఘర్షణలో గాయప డిన జహంగీర్‌ఖాన్ ప్రాణాలు కోల్పోయినాడు మళ్లీ 1868 జనవరి 27న మరోసారి సాలార్జంగ్ మీద దాడి జరిగింది ప్రజలకు సాలా ర్జంగ్ పట్ల ఉన్న వ్యతిరేకతకు ప్రబల నిదర్శనమిది. అదేవిధంగా బ్రిటిష్ వారి పట్ల శతృత్వం వహించిన అజ్మత్‌జంగ్, మీర్దాచంద్, బాజ్‌ఖాన్, మౌల్వి ఇబ్రహీంలు జైలు పాలయినారు. నిర్మల్ వద్ద 18 60 లో రాంజీగోండు నాయకత్వంలోని 300 మంది గోండులతో 200 మంది రొహిల్లాలు ప్రభుత్వంతో నిర్మల్ వద్ద తలపడ్డారు. ఈ యుద్దంలో తిరుగుబాటుదారులు అనేక మంది ప్రాణాలు కోల్పో యారు.
1860 నాటికి ఈ తిరుగుబాటల్నఉ ప్రభుత్వం అణచివేయ గలిగిన 1879 దాకా చెదురుమొదురుగా బ్రిటిష్ వ్యతిరేకత వ్యక్తమ వుతూనే వచ్చింది. 1879 నుంచి ఈ బ్రిటిష్ వ్యతిరేకత మరో రూపాన్ని సంతరించుకుంది. ఆకస్మిక చిన్న చిన్న తిరుగుబాట్లు రూపంలో కాకుండా ఆ వ్యతిరేకత లోతుల్లోకి విస్తృత జ్రానీకంలోకి వెళ్లింది. అది ఆధునిక జాతీయ రూపాన్ని సంతరించుకుంది. దీనికి కొందరూ ముస&ఇలం మేధావులు తాత్విక బౌద్దిక ప్రాతిపదికను సిద్దం చేసినారు. వీరి కృషిని కూడా జాతీయోద్యమంలో భాగంగానే చూడాలి. అలాంటి పని చేసినవారిలో అప్ఘనిస్తాన్ నుంచి 1879 లో హైద్రాబాద్‌కు వచ్చిన సయ్యద్ జమాలుద్దీన్ అఫ్షానీ ఒకరు. ఛాంద స మౌల్వీల భావాలను వ్యతిరేకించినాడు. కేవలం మత గ్రంథాల అధ్యయనమే కాక ముస్లింలు ఆధునిక ప్రకృతి శాస్త్రాలను, మానవ శాస్త్రాలను నేర్చుకోవాలన్నాడు. అధికార భాషగా దేశ భాష ఉండా లని అన్నాడు. బహుశా ఈ ప్రభావంతోనే 1884 లో పర్షియన్ భా ష స్థానంలో ఉర్దూ అధికార భాష అయింది. ఈ ఆధునిక విద్యను మాతృభాషలోనే నేర్పాలని అన్నాడు. అందుకు విశ్వవిద్యాలయం నెలకొల్పాలన్నాడు. అట్లా అని జాతీయ వ్యతిరేక పాశ్చాత్యీకరణను కోరుకోలేదు. ఇతని ఆలోచనలు హైద్రాబాద్ మీద గాఢంగా ప్రభా వం చూపినవి. అఫ్ఘానీ తీవ్రభావజాలాన్ని సహించని ప్రభువ్తం ఆయ న్ని 1881 లో హైద్రాబాద్ నుంచి వెళ్లగొట్టింది. సయ్యద్‌బిల్ గ్రామీ అభిప్రాయం ప్రకారం అప్ఘానీ ఫైర్‌బ్రాండ్ సంస్కర్త ఆప్ఘానీని అంది పుచ్చుకుని మౌల్వి మొహిబ్ హుస్సేన్ తర్వాత గొప్ప సాంఘీక సంస్క ర్త, గొప్ప జర్నలిస్టు అయినాడు. ఈయన హైద్రాబాద్‌లో స్త్రీ విద్యకు వైతాళికుడిగా, హైద్రాబాద్ జర్నలిజానికి రూపశిల్పిగా పేరుగాంచి నాడు. బురఖా పద్దతిని ఆనాడే వ్యతిరేకించి ఛాందస వాదుల కంట్లో నలుసుగా పరిణమించాడు. సంస్కర్తే కాక గొప్ప జాతీయవాది కూడా. బ్రిటిష్ విధానాల్ని తీవ్రంగా వ్యతిరేకించినాడు.
ప్రజలను సన్నద్దం చేసిన చేసిన మరోక సంస్కర్త ముల్లా అబ్దుల్ ఖయాం. విద్యారంగంలో నిర్భంద విద్యను స్కాలర్‌షిప్‌లను ప్రతిపా దించిన సంస్కరణాబిలాషి ఈయన ఉర్దూలో రాసిన ఏ ఫ్లీ ఫర్ హైద్రాబాద్‌లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ స్థాపించడానికి మూలకారణం ఇతడే. ఈయేశ్రీన కృషి వల్ల ముస్లిం ప్రజల్లో సాంఘీక విద్యా సం బంధ సంస్కరణల యొడల తహతహ ప్రారంభమైంది. మౌల్వి మ హ్మద్ ముర్తజా అబివృద్దికి విద్య మూలమని అయితే ఆ విద్య ఇంగ్లీ షు ద్వారా కూడా ఉర్దూ ద్వారా నేర్పితేనే ఉపయోగమని నిజాంకాలే జిని మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి విడదీసి వేరే విశ్వవిద్యాల యాన్ని నెలకొల్పాలని వాదించినాడు.
వీరందరి కృషి వల్లను తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నెలకొల్పబడింది. వీరు విద్య, సాంఘిక, పత్రికరంగంలో చేసిన కృషి వల్ల జాతీయోద్యమంలో ముస్లింలు ముస్లిమేతరులు పాల్గొనడానికి ప్రాతిపదిక సిద్దమయింది. ఈలోగా 1885 లో జాతీయ కాంగ్రెసు స్థాపించబడింది. దీనిలో తెలుగు, మరాఠీలతో పాటు ముస్లింలు కీలకపాత్ర నిర్వహించారు. దీనిలో ఇతరులతో పాటు ముల్లా అబ్దుల్ ఖయాం దస్తూర్ ఆసాగిషొంషాంగీ లాంటి వారు చేరి జాతీయోద్య మాన్ని పరిపుష్టం చేసినారు. 1888 అక్టోబర్ 21 న సికింద్రాబా ద్‌లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభకు రెండు వేల మంది హాజర యినారు. ఈ సభ నిర్వహణలో ముల్లా అబ్దుల్ ఖయాం కీలకపాత్ర నిర్వహించాడు. 1902 లో లార్డ్ కర్జన్ బీరార్ ఒప్పందం మీద సంతకం చేశాడు. ఈ ఒప్పందం జరిగిన తీరు హైద్రాబాద్ ప్రజలకు ఆగ్రహావేశాలు కలిగించింది. దీంతో బ్రిటిష్ ఇండియాలో 1905లో ప్రారంభంఅయిన స్వదేశి ఉద్యమం హైద్రాబాద్ రాజ్యంలోకి అడుగు పెట్టడానికి ప్రాతిపదిక ఏర్పడింది. అట్లా ఆఘోరనాథ్ ఛటోపాధ్యా య లాంటి వారితో కలిసి ముల్లా అబ్దుల్ ఖయాం అనే సంవత్సరం స్వదేశి ఉద్యమాన్ని ప్రారంబించాడు. విదేశీ వస్తువుల్ని బహిష్కరించ మని పిలుపునిచ్చారు.
అంజుమన్ ఇక్వాన్ సఫా అనే సంస్థ ఏర్పడింది. స్వదేశి ఉద్య మంలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సమాజ శాస్త్ర ప్రొపేసర్ బద్రుల్ హసన్ బొంబయి నుంచి చరఖాలను తెప్పించా డు. 1918 లో గాంధీ చేపట్టిన శాసనోల్లంఘన, సహాయ నిరాక రణ, సత్యాగ్రహాలతో ప్రభావితమయి విద్యాలయాలను వదిలి డాక్టర్ జయసూర్యతో పాటు మీర్ మహ్మద్ హుసేన్ అక్బర్ అలీఖాన్, మహ్మద్ అన్సారీ, మక్బూల్ అలీ మొదలైనవారు సాంఘీక కార్యక్ర మాల్లో పాల్గొన్నారు. ఖిలాఫత్ ఉద్యమంలో భాగంగా 16-3-19 20, 20-3-1920ల్లో జరిగిన సభల్లో పాల్గొన్న ఇరవై వేల మంది లో ముస్లింలు వేలాదిగా ఉన్నారు. ఈ ఉద్యమానికి కేశవరావు కోర ట్కర్, నవాబ్ అస్గర్‌యార్‌జంగ్‌లు నాయకత్వం వహించారు. 1920 నుంచి 1938 వరకు రాజకీయ కార్యకలాపాలు మందకోడిగా సాగి నవి. ఈ కాలం ప్రజలను సన్నద్దం చేయడానికి ఉపయోగపడింది.
1935 లో నైజాం రాజ్యంలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడాలనే లక్ష్యంతో నైజాం పౌర సంఘం ఏర్పడింది. ఇందులో ముస్లింలు ముస్లిమేతరులు ఉన్నారు. దీనికి నిజామతజంగ్ బహదూర్‌యార్ జంగ్ వంటి వారు సభ్యులుగా ఉండడం విశేషం. 1938 లో హైద్రా బాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడింది. కాని నిజాం ప్రభుత్వం వేంటనే దా న్ని నిషేదించింది. దానికి ప్రతిగా 1938 అక్టోబర్ నెలలో సత్యాగ్రా హం చేసినారు. ఈ సందర్బంగా అరెస్టయినవారిలో రామానంద తీర్థ, బద్దం ఎల్లారెడ్డి, కాళోజి మొదలయినవారితో పాటు షేక్‌నహీ సాబ్, షేక్ మొహినుద్దీన్ ఉన్నారు.
అనంతరం క్రిప్స్ ప్రతిపాదనలను తిరస్కరించి కాంగ్రెస్ పార్టీ 1942 లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ఈ సమయంలోనే అంతవరకు సాంస్కృతిక సామాజిక సంఘంగా ఉన్న అంజు టమన్ ఇత్తేహాద్ ఉల్ ముసల్మాన్ రాజకీయ రూపాన్ని రజాకార్‌గా మారి జాతీయోద్యమాన్ని సాగనివ్వమంటూ స్వతంత్య్ర హైద్రాబాద్ అనే విదానాన్ని లేవనెత్తింది.
డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి
ఇంకావుంది…