తెలంగాణ మైనరటీ వెల్ఫేర్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ

 

 

 

 

అశ్వరావుపేట నవంబర్ 11 ( జనం సాక్షి)అశ్వారావుపేట లో ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల మరియు కళాశాల లో జరిగే మొదట ఎడ్యుకేషనల్ మినిస్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 11 వా తేదిన అయన జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ డే గా జయంతి నీ ఘనంగా నిర్వహించారు. టి ఎం ఆర్ ఎస్ సి- టి ఎమ్ ఆర్ జె సి అశ్వారావుపేట రింగ్ రోడ్ లో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాటశాల మరియు పాత ఆంధ్రాబ్యాంక్ రోడ్డు నందు గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ శ్రీరామ్ మూర్తి. ఈ సంధర్బంగా మాట్లాడుతూ మొదటి ఎడ్యుకేషనల్ మినిస్టర్ చేసిన గౌరవనీయులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం రోజు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ డే గా జరుపుకోవడం ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు, పిరమిడ్ విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి అనీ, ఈ ఒక్క మైనారిటీ విద్యార్థుల కొరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళాశాల మరియు పాఠశాలలో చదివే విద్యార్థుల కొరకు ఒక్కో విద్యార్థికి ఒక సంవత్సరానికి లక్ష 19 వేల రూపాయలు ఖర్చు చేస్తుందని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉన్నత విద్యను అందించి అందించి ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరి వారి యొక్క తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చువలనే ఉద్దేశంతో ప్రతి విద్యార్థికి మంచి విద్యను అందించాలని భావనతో మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి పేద విద్యార్థి కొరకు ప్రత్యేక చొరవతో ఉన్నత విద్యను అందిస్తున్నారనీ ఈ మైనారిటీ పాఠశాలలో 2021-22 సంవత్సరాలలో 10 వతరగతి లో అశ్వరావుపేటలో ఉన్న మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో 10/10 మార్కులను సాధించడం జరిగిందని మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజి లో చదివే విద్యార్థిని నాసాలో ఆలిండియా 42 47 ర్యాంకులు సాధించిన విద్యార్థినులను అభినందించారు. 42 వ ర్యాంక్ వచ్చినా విద్యార్థినికి నాసా వాళ్ళు ప్రతి నెల 10000 కాలర్ షిప్ ఇవ్వడం జరుగుతుంది అనీ అలాగే 47 వ ర్యాంక్ విద్యార్థికి సంవత్సరానికి లక్ష రూపాయలు అందించటం జరుగుతుంది అని మరియు వీరికి పై చదువుల కొరకు అయ్యే ఖర్చు ను వారే భరిస్తారని అతి త్వరలో శ్రీహరీ కోట లో మన అశ్వారావుపేట పేరును నిలబెట్టేందుకు సైంటిస్టులుగా ఇక్కడి విద్యార్ధులు వెళ్ళడం నాకు చాల సంతోషంగా ఉందని విద్య అనేది జన్మ హక్కు అనే నినాదంతో 1951 వా సంవత్సరంలో కరక్ పూర్ లో ఐఐటీ కళాశాలను స్థాపించిన గొప్ప వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ టిఆర్ఎస్ పార్టి ప్రభుత్వం నిర్వహించే ఈ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలలో ఐదు రకాల భాషలలో విద్యను అందిస్తున్నారని,వాటిలో కెహిందీ,ఉర్దూ ఇంగ్లీష్ అరబ్బీ తెలుగు భాషలలో విద్యను అందిస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగ 204 మైనారిటీ గురుకులాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందని అలాగే ఆటలు మరియు డిబేట్ క్విజ్ పోటీల లో గెలిచిన విద్యార్థినిలకు,బహుమతులను కళాశాల తరుపున వారికి అందించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అట్టం రమ్యా ఎంపిటిసివేముల భారతి నండ్రూ భారతి కో ఆప్షన్ సభ్యులు పాషా ప్రిన్సిపాల్ సంగీత శార వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ డివెంకన్న ముభారక్ రాఘవేంద్ర అసిఫ్ ఉపాధ్యాయులు విద్యార్ధుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.