తెలంగాణ రాగానే బాగుపడేది లంబాడీలు: కేసీఆర్
హైదరాబాద్, జనంసాక్షి: తెలంగాణ రాగానే బాగుపడేది లంబాడీలు అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణలో ఒక్క లంబాడీ పిలగాడు కూడా నిరుద్యోగిగా ఉండకూడదని అన్నారు. గిరిజనులకు అన్నింటిలో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. లంబాడీ తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. లంబాడీ తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. దేవరకొండకు నీళ్లు తెచ్చే బాధ్యత తనదని గ్రామ పంచాయితీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. దేవరకొండకు నీళ్లు తెచ్చే బాధ్యత తనదని పేర్కొన్నారు. కండ్ల ముందు నాగార్జునసాగర్ ఉన్న తాగడానికి నీళ్లు లేవు అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మండలానికి 3 నుంచి 5 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.