తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్
పాత పెన్షన్ పునరుద్ధరణకై టీఆర్టీఎఫ్ నిరసన
నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు.*
వీణవంక సెప్టెంబర్ 1 (జనం సాక్షి) వీణవంక 2004 సెప్టెంబర్ 1 నుండి ఉద్యోగ ఉపాధ్యాయులకు కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అమలు చేసినందున ఈ సెప్టెంబర్ 1వ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ నల్ల బ్యాడ్జిలతో విధులకు హాజరై భోజన విరామ సమయంలో నిరసన తెలిపినట్లు టిఆర్ టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు నందికొండ విద్యాసాగర్ తెలిపారు.
శుక్రవారం నిరసన కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడుతూ టిఆర్టిఎఫ్ మరియు ఉద్యోగ ఉపాధ్యాయుల నిరంతర పోరాట ఫలితంగా కుటుంబ పెన్షన్ మంజూరు అయినదని అదేవిధంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ ను కూడా పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఉపాధ్యాయులందరికీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు . మార్కెట్ ఆధారిత కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వల్ల ఉపాధ్యాయులు తీవ్రమైన నష్టం చవిచూస్తున్నారని 30 సంవత్సరాల ఉద్యోగ జీవితం తర్వాత కూడా కనీస అవసరాలకు సరిపడు పెన్షన్ పొందలేకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారని అదే విధంగా మన రాష్ట్రంలో కూడా ఎన్నికల షెడ్యూల్ రాక ముందే పాత పెన్షన్ పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చల్లూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.