తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ పండుగను మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలో ఒకటని
మెదక్, సెప్టెంబర్ 26, 2022
జనం సాక్షి ప్రతినిధి మెదక్
తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ పండుగను మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలో ఒకటని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 3 వరకు తీరొక్క రీతిన తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా రెండవరోజైన సోమవారం నాడు డి ఆర్ డి ఓ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన అటుకుల బతుకమ్మ లో మరో అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మల చుట్టూ మహిళా సమాఖ్య సభ్యులు, మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడి ఉషారు కలిగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలకు అత్యంత విలువిచ్చి అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని అన్నారు. సంప్రదాయ బద్దంగా జరుపుకునే బొడ్డెమ్మ సంబురాలలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించే ముద్దపప్పు బతుకమ్మ కు కూడా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇందిరా, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, బతుకమ్మ సమన్వయాధికారి రాజి రెడ్డి, మహిళా సమాఖ్య సభ్యులు, మహిళలు పాల్గొన్నారు