తెలంగాణ రైతులపై మోడీ ప్రభుత్వం వివక్ష
ధాన్యం సేకరణలో జాతీయ విధానం రావాలన్న కెకె
న్యూఢల్లీి,నవంబర్29(జనం సాక్షి): ధాన్యం సేకరణపై కేంద్రం జాతీయ పాలసీ తీసుకరావాలని టిఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపి కె కేశవరావు డిమాండ్ చేశారు.తెలంగాణ రైతులపై మోడీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌సిఐ ధాన్యం సేకరణతో రైతులకు భద్రత ఉంటుందని, తెలంగాణలో పండిన ధాన్యాన్ని తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం పట్టించుకోవాలని కెకె దుయ్యబట్టారు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర టిఆర్‌ఎస్ ఎంపిలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కెకె మాట్లాడారు. వానాకాలంలో 1.2 కోట్ల టన్నుల ధాన్యం పండిరదని, 62 లక్షల ఎకరాల్లో వరి ఉందంటే కేంద్రం నమ్మడం లేదని మండిపడ్డారు. చివరికి 59 లక్షల ఎకరాల్లో వరి ఉందని కేంద్రం ఒప్పుకుందన్నారు. కనీస మద్దతు ధరకు తక్కువగా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఎన్నోసార్లు భర్తీ చేసిందన్నారు. పార్లమెంట్ ఆవరణంలోని గాంధీ విగ్రహం దగ్గర టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు, లోక్ సభలో టిఆర్‌ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర రావు, రాజ్య సభ సభ్యులు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, లోక్ సభ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, వెంకటేష్ నేత తదితరులు ప్ల కార్డులు పట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు.