తెలంగాణ వర్శిటీతో చికాగో యూనివర్శిటీ ఒప్పందం
నిజామాబాద్ లోని తెలంగాణ యూనివర్సిటీ, అమెరికాలోని చికాగో స్టేట్ యూనివర్సిటీల మధ్య విద్యార్థులు, అధ్యాపకుల పరస్పర బదిలీ కోసం అంగీకారం కుదిరింది. హైదరాబాద్ బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఎంఓయూపై ఇరుపక్షాలు సంతకాలు చేసి పత్రాలు మార్చుకున్నారు. తెలంగాణ వర్సిటీ ఇన్ చార్జ్ వీసీ పార్థసారథి, చికాగో వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ కానిస్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.నిజామాబాద్ ఎంపీ కవిత చొరవతో తెలంగాణ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డేవిడ్ కానిస్ తెలిపారు. ఒప్పందం ప్రకారం ఇకపై జీఆర్‌ఈ, టోఫెల్ లేకుండానే నేరుగానే చికాగో యూనివర్సిటీలో ఎంఎస్ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఏడాదికి 75 మంది విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు.ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో విద్యార్థుల బదిలీకి ఒప్పందం కుదిరింది. భవిష్యత్తులో ఫార్మా, నర్సింగ్, కెమికల్ టెక్నాలజీ తదితర రంగాల్లో కూడా విద్యార్థుల బదిలీకి అవకాశం కల్పించనున్నారు. ఈ ఒప్పందం వల్ల తెలంగాణలోని గ్రావిూణ విద్యార్థులకు కూడా విదేశాల్లో విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుంది. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించి అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.
మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్, తెలంగాణ వర్సిటీ రిజిస్ట్రార్ లింబాద్రి, చికాగో యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి రోహన్ అటెలె, నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ ప్రెసిడెంట్ రవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయం, అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయం మధ్య కీలక ఒప్పందం కుదిరింది. విద్యార్థులు, అధ్యాపకుల పరస్పర బదిలీ కోసం అంగీకారం చేసుకున్నాయి. తెలంగాణ ఇంఛార్జి ఉపకులపతి పార్థసారధి, చికాగో విశ్వవిద్యాలయం వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ కానిన్.. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సంతకాలు చేశారు. నిజామాబాద్ ఎంపీ కవిత చొరవతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు డేవిడ్ కానన్ చెప్పారు. ఈ ఒప్పందం ప్రకారం జీఆర్‌ఎఫ్, టోఫెల్ లేకుండానే నేరుగా చికాగో యూనివర్శిటీలో ఎంఎస్ చేయడానికి వీలు కలుగుతుంది. ఏడాదికి 75 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించే అవకాశం దక్కుతుంది.
నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ, అమెరికాలోని చికాగో యూనివర్సిటీల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. రెండు వర్సిటీలు విద్యార్థులు, అధ్యాపకుల పరస్పర బదిలీ కోసం అంగీకరించాయి. ఈమేరకు తెలంగాణ వర్సిటీ ఇన్‌ఛార్జీ వీసీ పార్థసారథి, చికాగో వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ కానిన్ సీఎం కేసీఆర్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం జీఆర్‌ఈ, టోఫెల్ లేకుండానే నేరుగా చికాగో యూనివర్సిటీలో ఎంఎస్ చేయడానికి వీలు కలుగుతుందన్నారు. ఏడాదికి 75 మంది విద్యార్థులకు అవకాశం లభించనుంది.ఒప్పందం ప్రకారం కంప్యూటర్ సైన్స్, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో విద్యార్థుల బదిలీకి వీలుంటుంది. ఫార్మా, నర్సింగ్, కెమికల్ టెక్నాలజీ రంగాల్లో విద్యార్థుల బదిలీకి అవకాశం ఉంటుంది. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో ఈ ఒప్పందం కుదిరినట్టు డేవిడ్ కానన్ తెలిపారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్సిటీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామన్నారు.