తెలంగాణ శరవేగంతో అభివృద్ధి

C

– మన పారిశ్రామిక విధానం ప్రపంచదృష్టిని ఆకర్షించింది

– సమైక్య రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర నిర్లక్ష్యం

– పరేడ్‌ గ్రౌండ్‌లో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,జూన్‌ 2(జనంసాక్షి): తెలంగాణ పారిశ్రామిక రంగం బ్రహ్మాండంగా ఉందని, పెట్టుబడులు వస్తున్నాయని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. టీ ఎస్‌ ఐపాస్‌ ద్వారా తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికరంగంలో పురోగతి సాధిస్తుందని అన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ సంచలనాలు సృష్టిస్తోందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఎం మాట్లాడుతూ ఐటీ రంగాన్ని వరంగల్‌ లాంటి అన్ని నగరాలకు విస్తరించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారని తెలిపారు. తెలంగాణలో భూ బ్యాంకు ఉందని పేర్కొన్నారు. వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ కోసం వెయ్యి ఎకరాల భూమిని కేటాయించామని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఫార్మాసిటీ కోసం వెయ్యి ఎకరాల భూమిని కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీ ఎస్‌ ఐపాస్‌ ద్వారా ఉన్న పరిశ్రమలు పటిష్టం అవడంతోపాటు కొత్త పరిశ్రమలు వస్తున్నాయని వివరించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టుబడుటు పెట్టేందుకు ముందుకు వస్తే పదిహేను రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు శరవేగంగా సాగుతున్నాయని  తెలిపారు. వచ్చే యేడాది చివరినాటికి 90 శాతం గ్రామాలకు శుభ్రమైన తాగునీటిని అందజేస్తామని స్పష్టం చేశారు. ఏ మహిళ మంచినీటి కోసం రోడ్డుపై నిలుచునే పరిస్థితి ఉండకూడదనే సత్సంకల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.

మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రధానితోపాటు పలు రాష్టాల్ర సీఎంలు ప్రశంసించారని తెలిపారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లలో నుంచి పుట్టిన నిప్పు అని ప్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. గోదావరి, కృష్ణా నదులు, కాకతీయులనాటి చెరువులు ఉన్నా ఎన్నో కష్టాలను అనుభవించామన్నారు. సమైక్య పాలనలో రాష్ట్రంలో కాకతీయుల కాలం నాటి చెరువులు పూడికతో నిండిపోయాయన్నారు. వాటిని బాగు చేసేందుకు తమ ప్రభుత్వం మిషన్‌ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టిందని వెల్లడించారు. ఉమ్మడి ఏపీలో రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ పనులు ముందుకు సాగలేదని గుర్తు చేశారు. మన నీటిని ఏపీకి తరలించుకు పోవడానికి సమైక్య పాలకులు కుట్రలు పన్నారని విమర్శించారు. 2022 నాటికి పూర్తిస్థాయిలో కోటి ఎకరాల భూమిని సాగులోకి తెస్తామని వెల్లడించారు.

అంతర్రాష్ట్ర నీటి సమస్యలు, పర్యావరణ సమస్యలు సృష్టించి మన ప్రాజెక్టులను అడ్డుకున్నారని చెప్పారు. కానీ తమ ప్రభుత్వం కోటి ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టుల రీ డిజైన్‌ చేసిందని వివరించారు. తానే స్వయంగా అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చిన విషయాన్ని తెలిపారు. తన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ను రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన దసరా నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాలు అమలులోకి వస్తాయని రాష్ట్ర ప్రజలకు తీపి కబురందించారు. రాష్ట్రంలో కొత్తగా 14 నుంచి 15 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా రెండేళ్ల పాలన సాగిందని,సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఓ లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్న తరుణమిది అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్‌ కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు దళాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు పతకాలు అందజేశారు. ఈ  సందర్భంగా రాష్ట్ర ప్రజల నుద్దేశించి సీఎం మాట్లాడుతూ… బంగారు తెలంగాణ నిర్మాణానికి స్పష్టమైన ఆలోచనతో ముందుకెళ్తున్నామని తెలిపారు. నిధులు, నీళ్లు, నియామకాల కోసమే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని.. ప్రత్యేక రాష్ట్రం వల్లే మన నిధులు మరో ప్రాంతానికి తరలింపు కాలేదని గుర్తు చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్టాన్రికి  బలమైన పునాది వేస్తే భావితరాలు బాగుంటాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు చేపట్టిన పథకాలు, వాటి అమలు తరీఉను మరోమారు గుర్తు చేశారు.  పేదింటి యువతుల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. బీసీలకూ కల్యాణ లక్ష్మి పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. కళాశాలల్లోనూ సన్నబియ్యం పథకం అమలు చేస్తామని తెలిపారు. అమానవీయ విధానం రద్దు చేసి పిల్లలకు సరిపడా ఆహారమే లక్ష్యమని వెల్లడించారు. 598 మంది అమరవీరుల కుటుంబీకులకు నియామక పత్రాలు అందజేశామని పేర్కొన్నారు. సాగు,తాగునీరు అందించి ప్రజల కష్టాలను దూరం చేసేందుకే మిషన్‌ కాకతీయ, ఇసన్‌ భగీరథ, ప్రాజెక్టుల రీడిజైన్‌ చేశామన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా 2018 నాటికి ఇంటింటికీ నల్లా ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ప్రకటించారు. భౌగోళిక పరిస్థితులు, నదీ మార్గాలు సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని ప్రాజెక్టుల పునరాకృతి చేశామని వివరించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ఇరుగు పొరుగు రాష్టాల్రను సంప్రదించామని, గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల కోసం మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకున్నామని గుర్తు చేశారు. అయితే ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టులకు మోకాలడ్డుతున్నాయన్నారు.  కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే కేంద్ర బిందువుగా పాలన సాగిస్తున్నామని పునరుద్ఘాటించారు.  రెండేళ్లలో ఎన్నో బాలారిష్టాలను ఎదుర్కొని సమస్యలను పరిష్కరించుకున్నామని తెలిపారు.  స్వాతంత్య్ర ఉద్యమమే స్ఫూర్తిగా ఉద్యమించి తెలంగాణ రాష్టాన్న్రి సాధించామన్నారు. శాంతియుతంగా పోరాడి రాష్టాన్న్రి సాధించామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఉద్యమం సాగిందన్నారు. రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరులకు నివాళులర్పించారు. మేనిఫెస్టోలో పేర్కొన్న వాగ్దానాలను అన్నింటిని నెరవేర్చామన్నారు. తెలంగాణ వచ్చాక మన ప్రభుత్వం అనే భావన ప్రజలలో ఏర్పడిందన్నారు. సమైక్య పాలనలో ప్రతీ రూపాయి అడుక్కునే పరిస్థితి ఉండేదన్నారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వమనే వెకిలి మాటలను ఎదుర్కొవాల్సి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇవాళ మన నిధులు మనమే ఖర్చు పెట్టుకుంటున్నామన్నారు. బంగారు తెలంగాణకు బాటలు వేసుకుంటున్నామని పేర్కొన్నారు. మన ప్రణాళిలకు మనమే రూపొందించుకుంటూ సుపరిపాలన అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

త్వరలో 9గంట వ్యవసాయ విద్యుత్‌

రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నదని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. త్వరలో వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ అందిస్తామని స్పష్టం చేశారు.  కారు చీకట్లు తొలగిపోయి వెలుగుజిలుగుల తెలంగాణ ఆవిష్కృతమైందన్నారు. ఇవాళ మనం బంగారు తెలంగాణ కోసం బాటలు వేసుకుంటున్నామని వివరించారు. తెలంగాణ వస్తే కరెంటు కష్టాలు తీరుతాయనే ఆశలు నెరవేరాయన్నారు. కోతలు లేని విద్యుత్‌ను అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త విద్యుత్‌ ప్లాంట్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇకపై తెలంగాణలో కరెంటు కోతలు ఉండవని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సంతోషంగా, సగర్వంగా ప్రకటిస్తున్నామన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. రెండేళ్లకాలంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో బాలారిష్టాలను అధిగమించి.. దేశంలోనే నంబర్‌ వన్‌గా అభివృద్ధిలో రాష్ట్రంగా ముందుకుసాగుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే విద్యుత్‌ ఉండదని, కారుచీకట్లు కమ్ముకుంటాయని అందరూ భయపెట్టారని, కానీ, ప్రత్యేక రాష్ట్రంతో చీకట్లు తొలిగి వెలుగుజిలుగుల తెలంగాణ ఆవిష్కృతమైందని, అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం చరిత్ర తిరగరాసిందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ద్వితీయశ్రేణి పౌరులుగా బతికారు వివక్షకు వ్యతిరేకంగా నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంగా కొత్త రాష్టాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో తమ బతుకులు బాగుపడుతాయన్న ప్రజల నమ్మకాన్ని ఈ రెండేళ్ల కాలం నిలబెట్టిందితెలంగాణ వస్తే ప్రజల కళ్లల్లో వెలుగేననే మాటను నిరూపించామన్నారు. రాష్ట్రంలో త్వరలో భూకమతాల ఏకీకరణ చేపడతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. నేటి నుంచి జూన్‌ 10 వరకు సాదా బైనామాలకు ఉచిత రిజిస్టేష్రన్లు చేస్తున్నామన్నారు. గతంలో భూపంపిణీ శాస్త్రీయంగా జరగలేదని పేర్కొన్నారు. వాటిని శాస్త్రీయంగా రూపొందిస్తామని వివరించారు. అసైన్డ్‌ భూములు అసైన్డ్‌దారుల దగ్గరలేదన్నారు. అసైన్డ్‌ భూములపై విచారణ చేపట్టామని పేర్కొన్నారు.

గుడాంబాను తరిమికొట్టాలి

గుడుంబా సేవించి రాష్ట్రంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సారాపై సర్కారు యుద్ధం ప్రకటించిందని వెల్లడించారు. గుడుంబాను అడ్డుకునేందుకు సరియైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గుడుంబా తయారీదారులు తగ్గిపోయారని తెలిపారు. వారికి ప్రత్యామ్నయ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు. దీంతో గుడుంబా తయారీ తగ్గిపోయిందన్నారు. ఆడ పిల్లల తల్లిదండ్రుల బాధలను అర్థం చేసుకుని షాదీ ముబారక్‌, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. సమైక్య పాలనలో ఆకలిచావులుండేవని తెలంగాణ వచ్చాక ఆకలి చావులుండకూడదని తాము ఇంట్లో ప్రతీ మనిషికి ఆరు కిలోల చొప్పున రేషన్‌ బియ్యం అందజేస్తున్నామన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశామన్నారు. ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 591 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ నియామక పత్రాలను అందజేస్తున్నామన్నారు. తెలంగాణ అమరవీరుల ప్రాణత్యాగం మరువలేనిదని పేర్కొన్నారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. సభాపతి మధుసూదనాచారి, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన వారిలో ఉన్నారు.టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హావిూలను నిలబెట్టుకుంటున్నామని సిఎం కెసిఆర్‌ అన్నారు. మ్యానిఫెస్టోలో ఇవ్వని హావిూలను కూడా ప్రజల సంక్షేమం దృష్ట్యా అమలుచేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాల మూస విధానాలు సమూలంగా మార్చివేసి,, పారదర్శకమైన సుపారిపలన అందించేదిశగా సాగుతున్నామన్నారు. తెలంగాణలో మన నిధులు మనమే ఉపయోగించుకుంటున్నాం. బంగారు తెలంగాణ నిర్మాణానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళుతున్నాం అని పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో అన్నారు. బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయం కన్నా ప్రణాళిక వ్యయం ఎక్కువగా ఉండటం అపూర్వం అన్నారు. అలాగే ప్రభుత్వం సంక్షేమ రంగానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. అసహాయులకు, అభాగ్యులకు మానవతా దృష్టితో ఫించన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్‌’ పథకాలు తీసుకొచ్చాం,ల్యాణలక్ష్మి పథకాన్ని బీసీలకూ, ఇతర కుల్లాల్లోని పేదలకు వర్తింపజేశామని చెప్పారు. ఈ  పథకం వల్ల బాల్యవివాహాలు ఆగిపోయాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలికి ఆలమటించకూడదని.. ప్రతి కుటుంబం ఆహార అవసరాలకు అనుగుణంగా  ఒక్కోక్కరికి 6 కిలోల చొప్పున రేషన్‌ బియ్యం ఇస్తున్నాం.ప్రభుత్వ హాస్టళ్లలో, గురుకులాల్లో, పాఠశాలలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం అందిస్తున్నాంజర్నలిస్టులకు హైదరాబాద్‌లో విడతలవారీగా ప్రత్యేక కాలనీ కట్టి ఇస్తామన్నారు. వ్యవసాయ దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూపంపిణీ ద్వారా వారి దరిద్రాన్ని పారదోలుతున్నామని అన్నారు. ఇకపోతే  రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా ఉత్తమ పోలీసులకు మెడల్స్‌ ప్రదానం చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతుల విూదుగా వీరికి అవార్డులను అందజేశారు. కాగా, ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర అవతరణ సంబురాలను ఘనంగా జరుపుకుంటున్నారు. జాతీయ జెండాను ఎగరవేసి జైతెలంగాణ నినాదాలతో వేడుకలు నిర్వహించుకుంటున్నారు.