తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబం బతుకమ్మ

-ప్రగతి ప్రిన్సిపాల్ బాలె శేఖర్.

రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీలు, తల్లులు, ఉపాధ్యాయ బృందము సంప్రదాయం ఉట్టిపడే విధంగా దుస్తులను ధరించి బతుకమ్మ ఆటపాటలతో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల.. బంగారు బతుకమ్మ ఉయ్యాల అంటూ పాట పాడుతూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్ మాట్లాడుతూ దేశంలోనే పూలతో నిర్వహించే ఏకైక పండుగ తెలంగాణ బతుకమ్మ సంబరాలని, 9 రోజులు ప్రకృతిలోని తీరొక్క పూలతో నిర్వహించే పండగే బతుకమ్మ అని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబం బతకమ్మ పండుగ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి బాలె జయశ్రీ శేఖర్, అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందము, తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.