తెలంగాణ సంస్కృతి సప్రదాయాలకు నిదర్శనం బతుకమ్మ సంబరాలు.

పీపుల్స్ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.
కళాశాల సెక్రటరి కరస్పాండెంట్ పి.ఉత్తం చంద్.
తాండూరు అక్టోబర్ 13 (జనం సాక్షి) తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ సంబరాలు అని పీపుల్స్ డిగ్రీ కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ఉత్తమ్ చంద్ అన్నారు.శుక్రవారం తాండూరు పట్టణం పీపుల్ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ఉత్తం చంద్ హాజరై బతుకమ్మకు పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యార్థినిలు అధ్యాపకులు బతుకమ్మను తయారుచేసి ఆటపాటలతో అలరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా బతుకమ్మ పాటలు పాడుతూ చిందులేశారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తులను ధరించి బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరి కరస్పాండెంట్ పి.ఉత్తం చంద్ మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. విద్యార్థినిలు సాంప్రదాయాల ప్రకారం దుస్తులు ధరించి ఆడి పాడడం అభినందనీయం అన్నారు.బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సత్యానంద్ కుమార్ కళాశాల మెంబర్ దారాసింగ్, పి. జనార్దనరెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.