తెలంగాణ సచివాలయానికి భారత రత్న బాబా సాహెబ్ పేరు. కోటగిరిలో దళిత,బహుజన నేతల సంబరాలు.

కోటగిరి సెప్టెంబర్ 17 జనం సాక్షి:-రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున సచివాలయానికి డా.బి.అర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయాలని సీఎం కెసిఆర్ నిర్ణయం తీసుకోవడంపై కోటగిరి మండల దళిత,బహుజన సంఘాలు,నేతలు సంతోషాని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తా వద్ద శని వారం రోజున సీఎం కెసిఆర్,స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి చిత్ర పటాలకు పాలాభి షేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సచివాలయానికి భారత రత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడంపై సీఎం కెసిఆర్ కు కోటగిరి మండలదళిత,బహుజన నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన క్రమంలో సీఎం కెసిఆర్ నాయకత్వంలో దళితులకు పలు రకాల సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయమని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల దళిత ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షులు మీర్జాపుర్ సాయన్న,దౌలయ్యా కాలే సాయిలు,
దౌలయ్యా,బహుజన నాయకులు, మండల ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.
Attachments area