తెలంగాణ సర్కారు సరికొత్త నిర్ణయం.. ప్రతి సమాచారం ఇక వాట్సాప్‌లో!

తెలంగాణ సర్కారు సరికొత్త నిర్ణయం.. ప్రతి సమాచారం ఇక వాట్సాప్‌లో!

సామాన్య ప్రజలకు ప్రతి సమాచారం నేరుగా అం దించాలని సర్కారు నిర్ణయించింది. పథకాల సమాచారం.. సేవలు సులభతరం చేసేందుకు సరికొత్తగా బుధవారం ‘తెలంగాణ సీఎంవో’ పేరిట వాట్సాప్‌ చానల్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా సీఎం కేసీఆర్‌ వార్తలు ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకొనే వీలుంటుంది.

దీనిని సీఎం పీఆర్వో సమన్వయంతో ఐటీ శాఖకు చెందిన డిజిటల్‌ మీడియా విభా గం నిర్వహిస్తున్నది. ఎవరైనా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే చాలు, ఈజీగా ఈ చానల్‌లో జాయిన్‌ కావచ్చు.

చానల్‌ను చేరుకోవడం ఇలా…

  • వాట్సాప్‌ అప్లికేషన్‌ను తెరవండి
  • మొబైల్‌లో Updates విభాగాన్ని ఎంచు కోండి. డెస్‌టాప్‌లో Channelsట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి.
  • తర్వాత ‘+’ బటన్‌ పైన క్లిక్‌ చేసి ‘Find Channels’ ను ఎన్నుకోండి.
  • టెక్ట్స్‌ బాక్స్‌లో Telangana CMO అని టైపు చేసి జాబితా నుంచి చానల్‌ను ఎన్నుకోండి.
  • ఈ QR Codeను సాన్‌ చేయడం ద్వారా కూడా తెలంగాణ సీఎంవో వాట్సాప్‌ చానెల్‌ లో పౌరులు చేరవచ్చు.

    Qr Coce