తెలుగుదేశం పార్టీకి కడియం శ్రీహరి రాజీనామా

వరంగల్‌ :తెదేపా సీనియర్‌ నేత కడియం శ్రీహరి ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన రెండ్రోజులుగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఈ ఉదయం రాజీనామా చేస్తున్నటుల& ప్రకటించారు. ఇటీవల జరిగిన తెదేపా తెలంగాణ ఫోరం సమావేశంలో సహచర నేతల అభిప్రాయాలతో విబేధించిన కడియం.. చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభకు కూడా హాజరు కాలేదు.