తెలుగు గొప్పతనాన్ని చాటేందుకే

ధ్వన్యనుకరణ మహోత్సవాలు

హైదరాబాద్‌ : విద్యార్థుల్లో కళాభివృద్ధిని పెంపొందించేలా ప్రభుత్వం సాంస్కృతిక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. తెలుగు భాషా వికాస సంవత్సరం సందర్భంగా రాష్ట్ర సాంస్కృతికశాఖ, మిమిక్రీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా ఏర్పాటుచేసిన తెలుగు ధ్వన్యనుకరణ మహోత్సవాలను ఆయన ప్రారంభించారు. తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను మిమిక్రీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని రాళ్ల బండి అన్నారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు రాళ్లబండి కవితాప్రసాద్‌ , సాంస్కృతిక శాఖ కార్యదర్శి బలరామయ్య , విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్‌ నేరేళ్ల వేణుమాధవ్‌, ప్రముఖ సినీనటుడు ఏవీఎస్‌ తదితరులు పాల్గొన్నారు.