తెలుగు రాష్టాల్ల్రో నెత్తురోడిన రోడ్లు
వేర్వేరు ప్రమాదాల్లో 8మంది దుర్మరణం
ప్రకాశంలో నలుగురు…విశాఖలో ఇద్దరు మృతి
అనంతలో ఒకరు, మేడ్చెల్‌లో మరోకరు మృత్యువాత
సూర్యాపేట జిల్లాలో బోల్తాపడ్డ కాకినాడ ట్రావెల్స్ బస్సు
విజయవాడ,ఆగస్ట్25(జనంసాక్షి): ఎపిలో రోడ్లు నెత్తురోడాయి. ఉభయ తెలుగు రాష్టాల్ల్రో జరిగిన వేర్వరు రోడ్డు ప్రమాదాల్లో కనిసం 8మంది దుర్మరణం చెందారు. ప్రకాశం జిల్లాలో బొలెరో వాహనంపై నుంచి జారిపడి నలుగురు దుర్మణం చెందిన ఘటన పెళ్లింట తీవ్ర విషాదం నింపింది. విశాఖలో జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. అనంతలో ఒకరు, మేడ్చెల్‌లో మరొకరు మృతి చెందారు.
రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుండి వ్యాన్ ఢీకొనడంతో వ్యాన్‌లో ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం ఎయిర్‌పోర్టు షీలానగర్ మధ్య జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఆనందపురం నుండి శ్రీహరిపురంలో ఉన్న స్టాక్ పాయింట్ కి వ్యాన్‌లో కోళ్లు తీసుకువస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్టు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కోళ్ల ఫామ్ వ్యాన్ అతి వేగంగా వెనకనుంచి వచ్చి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందారు. వ్యాన్ డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి.. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అనంతపురం లో జరిగిన మరో ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. చెట్టును ఆటో ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం నార్పల మండలంలో చోటుచేసుకుంది. నార్పల మండలం గూగూడు కనుం వద్ద ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లాలో అతివేగానికి ఓ యువకుడు బలయ్యాడు. బైక్ పై వేగంగా వెళ్తూ కరెంట్ స్తంభానికి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బాచి అనే 22 ఏళ్ల యువకుడు పల్సర్ బైక్ విూద వేగంగా వెళ్తూ.. జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్మిగడ్డ సాకేత్ టవర్ వద్ద కరెంటు స్తంభానికి ఢీ కొట్టి కింద పడిపోయాడు. తీవ్రగాయాలై.. ఘటనాస్థలంలోనే చనిపోయాడు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెపుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల వద్ద శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో సుమారు 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంల్లో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.