తైవాన్‌పై జోక్యంచేసుకోవద్దు

బైడెన్‌కు వార్నింగ్‌ ఇచ్చిన జిన్‌పింగ్‌

బీజింగ్‌,నవంబర్‌16(జనం సాక్షి ):  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో తైవాన్‌ విషయంలో ఇద్దరూ గట్టి వార్నింగ్‌లు ఇచ్చుకునట్లు తెలుస్తోంది. వీడియో లింక్‌ ద్వారా అగ్రదేశాధినేతలు ఇద్దరూ మాట్లాడుకున్నారు. వాషింగ్టన్‌ నుంచి బైడెన్‌, బీజింగ్‌ నుంచి జిన్‌పింగ్‌ సుమారు మూడున్నర గంటల పాటు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. వారి మధ్య మర్యాదపూర్వకంగా, సూటిగా సంభాషణలు జరిగినట్లు అర్థమవుతోంది. ఇటీవల రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడిన విషయం తెలిసిందే. ఇక తైవాన్‌ అంశంలోనూ నెలకొన్న టెన్షన్‌ మరోసారి బయటపడిరది. తైవాన్‌ స్వాతంత్యంª`ర కోసం మాట్లాడితే, అది నిప్పుతో చెలగాటం ఆడినట్లే అని జిన్‌పింగ్‌ తన సంభాషణ సమయంలో వార్నింగ్‌ ఇచ్చినట్లు చైనీస్‌ విూడియా పేర్కొన్నది. చైనాను నియంత్రించేందుకు కొందరు అమెరికన్లు తైవాన్‌పై పట్టు బిగిస్తున్నారని, ఇది ప్రమాదకరమైన పరిణామం అని, నిప్పుతో ఆటాడడం లాంటిదని, నిప్పుతో ఆటాడినవారు కాలిపోతారని జిన్‌పింగ్‌ అన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో బైడెన్‌ మాట్లాడిన విషయాలను వైట్‌హౌజ్‌ వెల్లడిరచింది. తైవాన్‌పై ఉన్న అభిప్రాయాన్ని అమెరికా వ్యక్తం చేసింది. తైవాన్‌ శాంతి పక్రియకు విఘాతం కలిగించరాదు అని, తైవాన్‌ ఏకీకరణను కూడా వ్యతిరేకిస్తున్నట్లు బైడెన్‌ చెప్పారు.