తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి
కరీంనగర్,నవంబర్6(జనంసాక్షి): కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన ఎండీ బాషుమియా(70) ఆదివారం తేనేటీగల దాడిలో మృతి చెందాడు. బాషుమియా ఆదివారం వ్యవయసాయ బావి వద్దకు వడ్లు నేర్పేందుకు వెళ్లాడు. ఆ పరిసరాల్లో చెట్టుపైన ఉన్న కోతులు తేనేతె/-టటెను కదిలించాయి. దీంతో తేనేటీగలు లేచి అతడిపై దాడి చేశాయి. బాషుమియాను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.