తేమ లేకుండా చూసుకోవాలి
ఆదిలాబాద్,అక్టోబర్30(జనంసాక్షి): పత్తి, సోయా పంటలను రైతులు ఆరబెట్టుకొని మార్కెట్‌కు తీసుకొస్తే మద్దతుధర కంటే ఎక్కువ ధర లభిస్తుందని ఎంపి గోడం నగేశం అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జీరో వ్యాపారం జోరుగా సాగేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతికి అడ్డుకట్ట వేశామన్నారు. రైతుల పంటలను నిలువ చేసుకోవడానికి ప్రభుత్వం గోదాముల నిర్మాణం చేపట్టిందని, అవి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు తమ పంట ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకొని ధర పెరిగినప్పుడు అమ్ముకోవచ్చన్నారు. రైతులు పండించిన పంటలకు మార్కెట్ యార్డుల్లో మద్దతు ధర కలిపించి కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆమేరకు అధికరాఉలు ఏర్పాటు చేశారని అన్నారు. తేమ శాతంపై రైతులకు అధికారులు అవగాహన కలిపించాల్సిన బాధ్యత అధికారులదేన్నారు. పండించిన పంటలను ఆరబెట్టుకొని మార్కెట్‌కు తీసుకొస్తే సీసీఐ మద్ద తు ధర కంటే ఎక్కువ చెల్లిస్తోందన్నారు. అన్ని మార్కెట్లలో పత్తి, సోయా, వరి తదితర పంటలను కొనుగోళ్లు చేపట్టాలన్నారు. అధికారులు మార్కెట్లలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లుచేయాలన్నారు.