తేలంగాణ ఇవ్వాలని డిమాండ్‌ చేయాలి

నిజామాబాద్‌,(జనంసాక్షి), తెలంగాణ ప్రజల మనో భాపాలనును దెబ్బ తీయకుండా ఉండేందుకు తెదేపా అధినేత చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇచ్చామని డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్‌ ప్రశ్నించారు కాగ్రెస్‌ భవన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో గడుగు మాట్లాడారు జిల్లాలో  పర్యటిస్తున్న మీరు ఇక్కడి నుంచైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్‌ చేయాలన్నారు తెలంగాణకు వ్యతిరేకం కాదని  అంటున్నారే తప్ప రాష్ట్రం ఏర్పడాలని మనసారా కోరుకోవడం లేదని చెప్పారు ప్రజలు నమ్మేస్థితిలో లేరని పేర్కొన్నారు పాదయాత్ర ద్వారా ఇస్తున్న వాగ్దానాలను ప్రజలు తిప్పికొట్టుతారని తెలిపారు తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు రైతులకు కార్మికులకు నిరుద్యోగులకు ఒరగబెట్టింది ఏమిలేదని  విమర్శించారు అధికారంలోకి వచ్చేందుకు మాత్రమే చంద్రబాబు పాదయాత్ర చేపట్టారని చెప్పారు పాదయాత్ర మీకోసం వస్తున్నా అని కాకుండా నా కోసం వస్తునా&, అనినామకరణం చేసి బాగుంటుందని అన్నారు  విలేకరుల సమావేశంలో పీసీసీ కార్యదర్శా రత్నాకర మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ నగేష్‌రెడ్డి పార్టీ నగర అధ్యక్షుడు కేశ వేణు రాజేంద్రప్రసాద్‌,బంటు బలరాం తదితరులు పాల్గొన్నారు.