తైబజార్ వేలం ఆపాలి : జీవన్ రెడ్డి
జగిత్యాల టౌన్, జూన్ 8 (జనంసాక్షి) :
, మున్సిపల్ చట్టం సెక్షన్ 277లో ఉన్న ప్రత్యేక అధికారంతో మున్సిపల్ కౌన్సిల్, ఏకగ్రీవతీర్మానం ద్వారా ఐదు సంవత్సరాల కాలం పూర్తి స్థాయిలో తై బజార్ పన్నును రద్దు వసూలు నిలిపివేయడం జరిగింది. పట్టణంలోని నిరుపేదలు కూరగాయలు, పండ్లు, రోడ్లపై తోపుడుబండ్లతో ఉపాధి పొందుతున్న చిన్న వ్యాపారస్తుల సంక్షేమార్థం 1994-95 లో ఎంపికైన మున్సిపల్ కౌన్సిలింగ్ రద్దు చేసిన తై బజార్ అంగడి పన్నును తిరిగి 1999-2000 లో ఎన్నికైన మున్సిపాలిటీ ప్రవేశపెట్టింది. మళ్లీ గతంలో 1994-95 లో ఎంపికైన మున్సిపల్ కౌన్సిలింగ్ తై బజార్‌ను అంగడి పన్నును ఏదైతే రద్దు చేయడం జరిగిందో అదే క్రమంలో 2005-06 లో ఎంపికైన మున్సిపల్ కౌన్సిలింగ్ తీర్మానం ద్వారా రద్దు చేయడం జరిగింది. అప్పడినుండి ఇప్పడివరకు జగిత్యాల మున్సిపాలిటీ తై బజార్ అంగడి పన్నును రద్దు చేసి రాష్ట్రంలోనే పేదల పక్ష పార్టీగా ఆదర్శంగా నిలిచిందన్నారు. మళ్లీ పురపాలక సంఘంవారు తైబజార్ వేలం ప్రకటన జూన్ 1న వెలువడిన ప్రకటన గమనించగా వాస్తవంగా మున్సిపల్ చట్టంసెక్షన్ 277 కు అనుగుణంగా కేవలం మున్సిపల్ నిర్దేశించిన ప్రాంతం (మార్కెట్) అనగా మున్సిపాలిటీ ద్వారా సౌకర్యాలు పొందుతూ, వ్యాపారనిమిత్తం గుర్తించిన ప్రాంతాలు మాత్రమే ”తైబజార్” పరిధిలోకి వస్తాయని భావించక తప్పదు. కాని, ప్రస్తుతం జగిత్యాల పట్టణంలో ఏప్రాంతమైనా మున్సిపాలిటీ నుండి ఏ విధమైనటువంటి సౌకర్యాలు పొందలేకపోతున్నప్పటికి , కేవలం రోడ్లపై తోపుడు బండ్లపై ఆధారపడే వారిపైనుండి కూడా తైబజార్ అంగడి పన్నును వసూలు చేయాలని సంకల్పించుట ఆశ్చర్యకరమే కాకుండా చట్టవిరుద్ధమని కూడా చెప్పక తప్పదు. ఈ పరిస్థితిలో త్వరలో మున్సిపల్ ఎన్నిలు నిర్వహిం పబడబోతున్న తరుణంలో మున్సిపల్ ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్న పరిస్థితిలో గతంనుండి రాష్ట్రంలోనే ఆదర్శంగా రోడ్లపై మున్సిపల్ నుండి ఏవిధమైనటువంటి సౌకర్యాలు ఏర్పరచని ప్రాంతాల్లో ”తైబజార్ అంగడి పన్ను నెపంతో ఆర్థికంగా భారం వేయటం సెక్షన్ 277 అనుగుణంగా చట్ట విరుద్ధం. త్వరలో మున్సిపల్ ఎన్నిలు జరుగబోతున్నతరుణంలో ఇట్టి తై బజార్ జగిత్యాల పట్టణంలో తలపెట్టిన అంగడి పన్ను వేలం ప్రకటనను ఎన్నికలు నిర్వహింపబడి కొత్త మున్సిపాలిటీ ఏర్పడే వరకు వారి నిర్ణయార్థం వాయిదా వేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆర్డీవోకు వినతి పత్రాన్ని శుక్రవారం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బండ శంకర్, టీ.దేవేందర్ రెడ్డి, మెట్టబట్టి, ఎల్.వెంకటి, జిల్లా గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.