తైవాన్ పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ సమావేశం
పెట్టుబడులకు తెలంగాణే అనుకూలం
హైదరాబాద్,జూన్5(జనంసాక్షి): మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తైవాన్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రాష్టాన్రికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఆయన తైవాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడి పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలతో తీరిక లేకుండా ఉన్నారు. పలు రకాల పరికరాలు తయారు చేసే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సంస్థ అయిన న్యూకిన్ఫో గ్రూప్ సీఈవో సిమెన్ చెన్‌తో, వోల్క్ టెక్ సంస్థ ఛైర్మన్ జేమ్స్ చెన్‌తో ఆయన సమావేశమయ్యారు. వివిధ దేశాల్లో 12 కర్మాగారాలు ఉన్న కిన్ఫో గ్రూప్‌కు భారత్‌లో ప్లాంట్ లేదు. ఈ సంస్థ క్యాలుకులేటర్లు, హార్డ్ డిస్క్‌లు, ప్రింటర్లు, మదర్ బోర్డులు తయారు చేస్తుంది. ప్రస్తుతం మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు కిన్ఫో, వోల్క్ టెక్ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను మంత్రి వారికి వివరించారు. త్వరలో రెండు సంస్థల ప్రతినిధులు హైదరాబాద్‌కు రానున్నట్టు సమాచారం.