తొలి రోజు పోలింగ్‌ ప్రశాంతం

-దక్షాణ మద్య రైల్వెగుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభం
బెల్లంపల్లి, : దక్షిణమధ్య రైల్వెలో గుర్తింపు కార్మిక సంఘాలకు గురువారం ఎన్నికల పోలింగ్‌ జరిగి ఎన్నికలను నిర్వహిస్తారు. ఈ నెల 26 27 తేదిల్లోను ఎన్నికలు జరుగుతాయి.
ఎన్నికల నిర్వహణ కోసం బెల్లంపల్లిలోని రైల్వే ఫంక్షన్‌హాలులో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. తొలి రోజు ఎన్నికల్లో రైల్వె కార్మికులు ఉత్సహంగా పాల్గొన్నారు. పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ప్రధాన కార్మిక సంఘాలు శిబిరాలను ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించాయి. బెల్లంపల్లి బ్రాంచి పరిధిలో 599మంది ఓటర్లున్నారు. తొలి రోజు 169మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దక్షిణ మధ్యరైల్వే కార్మిక సంఘ్‌(డీఎంఆర్‌కేస్‌), రైల్‌ మజ్దూరు యూనియన్‌ (ఆర్‌ఎంయూ), దక్షిణ మధ్య రైల్యే ఎంప్లాయిస్‌ సంఘ్‌ (ఎస్‌సీఆర్‌ఈఎస్‌) దక్షిణ మధ్య రైల్యే మజ్దూర్‌
యూనియన్‌ (ఎస్‌ఈఆర్‌ఎంయూ), బరిలో ఉన్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరగాడానికి ఆర్పీఎఫ్‌ పోలీసు బలగాలు గట్టీ బందోబస్తు నిర్వహించాయి. తొలిరోజు ఎన్నికల ప్రశాంతంగా ముగిశాయి.