త్యాగాల చరిత్ర ఏఐటీయూసీదే.

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బాలరాజు.
పోటో: అభివాదం చేస్తున్న ఏఐటీయూసీ నాయకులు.
బెల్లంపల్లి, అక్టోబర్ 9, (జనంసాక్షి)
కార్మిక హక్కుల కోసం పోరాటాలు, త్యాగాలు చేసిన ఘనత ఏఐటీయూసీదేనని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బాలరాజు అన్నారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి కళావేదికలో ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా 3వ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మనదేశంలో 1920 అక్టోబర్ 31 న మొట్టమొదటి కార్మిక సంఘంగా ఏఐటీయూసీ
ఆవిర్భవించిందని, స్వాతంత్రంకు పూర్వమే కార్మిక సంఘాల చట్టం, ఫ్యాక్టరీల చట్టం,
పారిశ్రామిక వివాదాల చట్టం, కనీస వేతనాలు చట్టం, అనేక హక్కులు కార్మిక సంఘాలు
స్వామి లేని రోజుల్లోనే ఏఐటియూసి సాధించిందన్నారు. బ్రిటీష్ వలసవాద సామ్రాజ్యవాదుల నుండి ఈ
దేశ విముక్తికై జరిగిన స్వాతంత్ర సంగ్రామంలో కార్మిక వర్గాన్ని సంఘటితం చేసి స్వాతంత్రం
సాధనయే ధ్యేయంగా పోరాటాలు చేసిన దేశభక్తి గల కార్మిక సంఘం ఏఐటియుసి అన్నారు.
ఏఐటీయూసీ త్యాగాల చరిత్ర జిల్లా కార్మిక ఉద్యమంలో ఏఐటియుసి చరిత్ర
అగ్రభాగం అన్నారు. అమరజీవి కామ్రేడ్ వీటీ అబ్రహం, కామ్రేడ్ పి నర్సయ్య, కామ్రేడ్ బాసెట్టి
స్వామి, గంగారం మరియు కామ్రేడ్ పోతుగంటి పోశెట్టి ఇలా ఎంతోమంది అమరులు ఈ జిల్లా
కార్మిక ఉద్యమంలో ప్రాణాలర్పించారని గుర్తు చేశారు.
ఆధిపత్య నిరంకుశ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కార్మిక వర్గం ఒక నూతన ఉత్తేజంతో కలలు కన్నా కార్మిక వర్గానికి భంగపాటే మిగిలిందని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మికుల సమస్యలు
పరిష్కరించకపోగా సమస్యలు పరిష్కరించమని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనుకున్నా కార్మిక
సంఘాలని హేలన చేస్తూ దిక్కుమాలిన సంఘాలని తన దొర నైజాన్నీ ప్రదర్శించిన అహంభావి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే కాంట్రాక్టు వ్యవస్థ
రద్దుచేసి వారందరినీ పర్మినెంట్ చేస్తామని చెప్పిన కెసిఆర్ అధికారంలోకి వచ్చాక
అసంఘటితరంగా కార్మికుల్ని పట్టించుకున్న పాపాన పోలే పిట్టలదొరకు కేసిఆర్ ఏమాత్రం
తీసిపోడు అని నిరూపించుకున్నాడన్నారు. కనీస వేతనాలు ఎక్కడ అమలు చేయకుండా
అసంఘటితరంగ కార్మికుల పొట్ట కొడుతున్న ప్రభుత్వం టిఆర్ఎస్ అని, ప్రభుత్వం కనీస వేతనాల కమిటీ కూడా ఏర్పాటు చేయకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోగా కార్మికులను విభజించి కార్మిక వర్గాన్ని ఐక్యం కాకుండా టీఆరెస్ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. సింగరేణిలో ఎన్నికల గడువు ముగిసి
సంవత్సరం కాలం గడిచిన ఎన్నికలు జరగకుండా ఓటమి భయంతో ఎన్నికల నిర్వహణ జరగకుండా కుట్రజేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు అప్రజాస్వామిక
విధానాలకు ఏకచత్రాధిపత్య పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్పొరేట్ల ఏజెంట్ బిజెపి నరేంద్ర మోడీ సంతలో సరుకుల్లాగా ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని
దేశంలో కొద్దిమంది వ్యక్తుల ఆస్తులుగా మార్చడానికి బిజెపి నరేంద్రుడు ఉవ్విళ్లూరుతున్నాడన్నారు. ఈసమావేశంలో నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కలవెన శంకర్, రేగుంట చంద్రశేఖర్, బొల్లం పూర్ణిమ, మామిడాల రాజేశం, మిట్టపల్లి వెంకటస్వామి, బియ్యాల వెంకటస్వామి, బి తిరుపతి గౌడ్, జిసి మాణిక్యం, గొల్ల శ్రీనివాస్,
జాడి పోషం, బొంతల లక్ష్మీనారాయణ, డిఆర్ శ్రీధర్, బియ్యాల ఉపేందర్, ఆడపు రాజమౌళి,రంగా ప్రశాంత్,
ఎం రవీందర్, సిహెచ్ బాపు, ఎం లక్ష్మీనారాయణ, ఎస్ నాగేశ్వరరావు, బొంకురి రామచందర్, ఎం రమేష్, బుర్కా ప్రశాంత్, కాపులి శంకర్, వెంకటేశ్వర్లు, అన్వేష్, కుందేళ్ళ శంకర్, పోతుల లింగయ్య, ఎస్ రాజేందర్, తిలక్ అంబేద్కర్, ఎల్తూరి శంకర్ కార్మికులు పాల్గొన్నారు.