త్యాగాల చరిత్ర కలిగిన విప్లవ విద్యార్థి సంఘం పిడిఎస్యు

-పిడిఎస్యు సభ్యత నమోదు కార్యక్రమంలో
-పిడిఎస్యు జిల్లా నాయకులు బానోత్ దేవేందర్

కురవి అక్టోబర్-14 (జనం సాక్షి న్యూస్)

ఎంతో త్యాగాల చరిత్ర కలిగిన విద్యార్థి సంఘం పిడిఎస్యు అని పిడిఎస్యు జిల్లా నాయకులు బానోత్ దేవేందర్ అన్నారు. కురవి మండల కేంద్రంలోని బలపాల, రాజోలు గ్రామాలలోని జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ లో పిడిఎస్యు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా నాయకులు బానోత్ దేవేందర్ మాట్లాడుతూ.. జార్జి రెడ్డి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ శ్రీపాద శ్రీహరి లాంటి ఎందరో విద్యార్థి రత్నాలు తమ ప్రాణాలను అర్పించి ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు శాస్త్రీయ విద్య సమాన విద్య కావాలని మతోన్మాదానికి వ్యతిరేకంగా పిడిఎస్యు విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పిడిఎస్యు లో చేరడం అంటే సమాజంలో నెలకొన్న అసమానతలను వ్యతిరేకించడమే అని అన్నారు. నేడు దేశంలో జరుగుతున్న మతోన్మాద ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించాలంటే ప్రతి విద్యార్థి ప్రగతిశీల భావజాలంతో దృఢంగా నిలబడాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు చిరు, ప్రదీప్ విద్యార్థులు కళ్యాణం,అశోక్, జైపాల్,సుమన్, ప్రకాష్,కళ్యాణి,స్వర్ణ, సంధ్య,శ్యామలత, సుప్రియ,జాహ్నవి, మంజుల తదితరులు పాల్గొన్నారు.