-->

త్వరగా మిషన్‌ భగీరథ పూర్తి

కాంట్రాక్టర్లకు కలెక్టర్‌ ఆదేశాలు
జగిత్యాల,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  ప్రతి ఇంటికీ నీరివ్వాల న్నదే ప్రభుత్వ లక్ష్యమనీ, ఆ దిశగా అధికారులు, కాంట్రాక్టర్లు పనిచేయాలని కలెక్టర్‌ శరత్‌ ఆదేశిం చారు. మిషన్‌ భగీరథ నీరు గ్రామాల్లో ప్రతి ఇంటింటికి వచ్చేలా ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా పనిచేసి నల్లాలు పెట్టి కనెక్షన్‌ ఇవ్వాలన్నారు. అలాగే చేయని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనిచేయని కాంట్రాక్టర్లను తొలగించి వారి స్థానంలో మరొకరిని తీసుకొని పనులు ఫిబ్రవరి నెలలో పూర్తి చేయాలని అ ధికారులను ఆదేశించారు. మిషన్‌ భగీరథ పనులపై జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ సవిూక్ష
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్‌ భగీరథ నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా గ్రామాల్లో నీరు అందించాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లకు సూచించారు. పైపులు వేసినప్పుడు తవ్విన గుంతలు పూడ్చాలనీ, సీసీ రోడ్డులు తవ్విన దగ్గర సీసీ రోడ్డును సరిచేయాలన్నారు. పైపులు అసంపూర్తిగా చేయకూడదనీ, పాత, కొత్త ట్యాంకులు పూర్తి చేసి అన్ని ట్యాంకులకు నీటి కనెక్షన్‌ ఇవ్వాలన్నారు. అదే విధంగా బుగ్గారం, ధర్మపురి, గొల్లపెల్లి, పెగడపల్లి, వెల్గటూర్‌, బీర్‌పూర్‌, జగిత్యాల, రాయికల్‌, సారంగాపూర్‌, కొ డిమ్యాల, మల్యాల, కథలాపూర్‌, మేడిపల్లి మండలాల వారీగా కాంట్రాక్టర్లు, ఇంజినీర్లతో మాట్లాడుతూ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.