త్వరలో అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి: మంత్రి కొప్పుల

జనం సాక్షి న్యూస్ అక్టోబర్ 2 జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలోని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక చొరవతో సామాజిక ఆసుపత్రి ని, 30 పడకలతో వైద్య విధాన పరిషత్ ఆదీనంలోకి తీసుకురావడం జరిగిందని జనం సాక్షి ప్రతినిధికి ప్రకటన ద్వారా తెలిపారు.ఈ ఆసుపత్రి లో త్వరలో అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని, వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రిలో తొమ్మిది మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ ని డిప్టేషన్ పై తీసుకురావడం జరిగినది.జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజీ నుండి ఎముకల వైద్య నిపుణులు నవీన్,స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ శిరీష,జనరల్ సర్జన్ డాక్టర్ హరికిరణ్,మత్తు వైద్యులు శ్రీకాంత్,పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మానస,
చర్మ వైద్య నిపుణులు డాక్టర్ సుమన్,ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ డాక్టర్ రాజకుమార్,కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఝాన్సీసాధారణ వైద్యులు డాక్టర్ శిరీష బేగం విధుల్లో చేరుతున్నట్లు మంత్రి మాట్లాడుతూ,అలాగే ఇప్పటి నుండి ఈ ఆసుపత్రి లో శవ పరీక్షలు (పోస్ట్ మార్టమ్), కేసులు (మెడికల్ లీగల్ కేసులు) ఇక్కడ నుండి ధర్మపురి లోనే జరగనున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియా ద్వారా ప్రజలకు తెలిపారు.