త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు..!

 

Breaking | త్వరలోనే ఎన్నికల నగారా.. అంతా సిద్ధం చేసుకుంటున్న ఎలక్షన్​  కమిషన్​ | Prabha News

` 24న ఛత్తీస్‌గఢ్‌లో ఈసీ పర్యటన..
న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి రెండు రోజుల పాటు ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ సారధ్యంలో ఎన్నికల కమిషనర్లు, అధికారులు పర్యటిస్తారు. ఈ నెలాఖరులో మిజోరంలో పర్యటిస్తారని ఈసీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడానికి ముందుగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)తోపాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పర్యటించి.. ఏర్పాట్లను సవిూక్షిస్తారు.వచ్చే అక్టోబర్‌`నవంబర్‌లో ఛత్తీస్‌ గఢ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, మిజోరం, రాజస్థాన్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఏడాది డిసెంబర్‌ 17తో మిజోరం అసెంబ్లీ పదవీ కాలం ముగుస్తుంది. మిజోరంలో మిజో నేషనల్‌ ఫ్రంట్‌ అధికారంలో ఉంది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చే ఏడాది జనవరిలోని వివిధ తేదీలతో గడువు ముగుస్తుంది. తెలంగాణలో భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, ఛత్తీస్‌ గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నాయి.