త్వరలో కొత్త వంద రూపాయిల నోట్లు

india_rbi_100_rupees_2015-00-00_b295a_pnl_9bf_008606_r_fకేంద్రంలోని మోదీ సర్కారు తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సాహసోపేతమైనదని ‘ద గ్లోబల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ పీపుల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌’(జీవోపీఐవో) అభివర్ణించింది. అయితే ప్రవాసుల కోసం రద్దయిన రూ.500, వెయ్యినోట్లు జమ చేసే గడువును పెంచాలని వారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీని అభ్యర్థించారు. రద్దయిన నోట్లను బ్యాంకులో జమ చేయాలంటే ఎన్‌ఆర్‌ఐలకు, భారత సంతతికి చెందిన వారికి ఇబ్బందిగా పరిణమించింది. ప్రస్తుతం వారున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం విధించి గడువులోగా పెద్ద నోట్లను జమ చేసేందుకు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో నోట్లను జమ చేసే గడువు కనీసం ఆర్నెల్ల వరకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు జైట్లీకి వారు లేఖ రాశారు. కాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) త్వరలో కొత్త వంద రూపాయిల నోట్లను విడుదల చేయనున్నది. అయితే పాత వంద రూపాయిల నోట్లు కూడా చెలామణీలో ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది.