త్వరలో జిల్లా స్థాయి క్రీడలు
ఖమ్మం, డిసెంబర్ 12 : నాల్గవ తరగతి ఉద్యోగుల జిల్లాస్థాయి క్రీడలు జనవరి 4,5,6 తేదీల్లో ఖమ్మం పట్టణంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించేందుకు అనుమతించారని నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లింగయ్య తెలిపారు. పదవ పీఆర్సీ, 42 రోజుల సకల జనుల సమ్మెను ప్రత్యేక సెలవుగా ప్రకటించాలని కంటిన్‌జెంట్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలను పొరుగు సేవల ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలంటూ ఈ నెల 19న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.