త్వరలో బగ్గుమనబోతున్న పెట్రోల్

petrol_priceప్రజలకు త్వరలోనే పెట్రో, డీజిల్‌ సెగ తగలనుంది. వచ్చే మూడు నాలుగు మాసాల్లో లీటరు పెట్రోల్‌ ధర రూ.80కి, డీజిల్‌ ధర రూ.68కు చేరొచ్చని అంచనా. చమురు లభ్యత దేశాలు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి. చమురు ధరలను నియంత్రిం చి మార్కెట్‌లో సమతుల్యతను తెచ్చేందుకు ‘ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌’ (ఒపెక్‌ దేశాలు) ఉత్పత్తిని తగ్గించుకో నేందుకు ఒప్పందం కుదుర్చుకు న్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు ఉత్పత్తి తగ్గి డిమాండ్‌ తద్వారా ధరలు పెరగనున్నాయి. ఒపెక్‌ దేశాల నిర్ణయంతో రానున్న మూడు, నాలుగు నెలల్లో రిటైల్‌గా పెట్రోలు ధరలు 5-8 శాతం, డీజిల్‌ ధరలు 6-8 శాతం మేర పెరిగే అవకాశం కనిపిస్తోందని క్రిసిల్‌ ఒక నివేదికలో పేర్కొంది. జనవరి నుంచి రోజుకు 1.2 మిలియన్‌ పీపాల చమురు ఉత్పత్తిని తగ్గించుకోనున్నట్లుగా ప్రకటించాయి. 2008 తరువాత ఇదే అతిపెద్ద కోత అని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.