త్వరలో శక్తివంతమైన దేశంగా భారత్
– కేంద్రమంత్రి వెంకయ్య
లాస్ ఏంజెల్స్,జులై5(జనంసాక్షి):భారతదేశం త్వరలోనే శక్తివంతమైన దేశంగా తయారవుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో నిర్వహించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) తెలుగు సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడారు. ‘చాలా కాలం తర్వాత కేంద్రంలో ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. ‘ఏబుల్ లీడర్… అండ్ స్టేబుల్ గవర్నమెంట్’ అని ఉద్ఘాటించారు. మోదీ అంటే త్రీ ‘డి’ అని, దాని అర్థం… డైనమిక్, డెస్సెసివ్, డెవలప్‌మెంట్ అని వివరించారు. అమెరికా మాడిసన్ స్వేర్, ఆస్టేలియాలోని సిడ్నీ, చెయనా, జపాన్, జర్మనీ ఎక్కడికి వెళ్లినా ప్రధానిమోదీకి జేజేలు పలుకుతున్నారని, ఆ జేజేలు భారతదేశ ఔనత్యానికి నిదర్శనమని స్పష్టం చేశారు.వెంకయ్యనాయుడికి స్వాగతం పలికిన వారిలో నాట్స్ ా’య్రర్మన్ మధు కొర్రపాటి, అధ్యక్షుడు రవి ఆచంట, రవి మాదాల, కన్వెన్షన్ ా’య్రర్మన్ రవి ఆలపాటి, డిప్యూటి ా’య్రర్మన్ ప్రసాద్ పాపుదేశి, మీడియా డైరెక్టర్ కృష్ణ మల్లిన, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ గంగాధర్ దేశు, అరుణ గంటి, బసవేంద్ర సూరపనేని రాజ్ అల్లాడ తదితరులు ఉన్నారు.