త్వరలో సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్‌ దర్శన టోకెన్లు జారీ

తిరుమల,జూలై9(జనంసాక్షి): త్వరలో సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్‌ దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిప్రకటించారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ… ఆఫ్‌లైన్‌ విధానంలోనూ అంగప్రదక్షిణ టోకెన్లు కేటాయిస్తామన్నారు. డిసెంబర్‌లోగా శ్రీనివాస సేతు పనులు పూర్తి అవుతాయని, త్వరలోనే మ్యూజియం అభివృద్ధి పనులు ప్రారంభంకానున్నట్లు చెప్పారు. తీడీ విధానంలో మ్యూజియంలో శ్రీవారి 256 అభరణాలను ప్రదర్శిస్తామన్నారు. జూన్‌లో 23.23 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, జూన్‌లో శ్రీవారికి రూ.123.74 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని తెలిపారు. అలాగే 95.34 లక్షల లడ్డూల విక్రయం జరిగిందని, 50.61 లక్షల మందికి అన్నప్రసాదం అందించినట్లు చెప్పారు. 11.61 లక్షల మంది తలనీలాల సమర్పణ జరిగిందని ధర్మారెడ్డి వెల్లడిరచారు.