త్వరలో హైదరాబాద్‌లో సమితి సభ్యులతో సదస్సు
కరీంనగర్ సదస్సులో పోచారం వెల్లడి
కరీంనగర్,ఫిబ్రవరి26(జనంసాక్షి): త్వరలో 1.61 లక్షల మంది రైతు సమితి సభ్యులతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్‌లో రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సుకు మంత్రి పోచారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటి యాభై లక్షల ఎకరాల్లో సాగుచేయడమే మన లక్ష్యమన్నారు. రైతు సమన్వయ సమితి సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేసిందని..ఇది ఆశామాషీ వ్యవహారం కాదని పోచారం తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితోపాటు మంత్రి ఈటల రాజేందర్ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదిలావుంటే కరీంనగర్ లో జరుగనున్న రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సుకు సభ్యులు హాజరయ్యేందుకు వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. . సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సదస్సు కోసం బోధన్, కోటగిరి, జగిత్యాల నుంచి రైతు సమన్వయ సమితి సభ్యులు ప్రత్యేక బస్సుల్లో చేరుకున్నారు. బోధన్ మండల సమన్వయ సమితి కో ఆర్డినటర్ బుద్దె రాజేశ్వర్, సభ్యులు, ఉన్నతాధికారులు ఉదయం జెండా ఊపి ప్రత్యేక బస్సును ప్రారంభించారు. అదేవిధంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం నుండి రైతు సమన్వయ సమితి సభ్యులు సీఎం సభకు బస్సుల్లో బయలుదేరారు.
ప్రత్యేక మండల రైతు సమన్వయ సమితి సభ్యులు, జిల్లా సమన్వయ సమితి సభ్యులు సదస్సులో పాల్గొన్నారు.