త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి చేయండి

4

– సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,జనవరి 4(జనంసాక్షి):   కృష్ణా, గోదావరి నదులపై తలపెట్టిన ప్రాజెక్టుల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తయ్యేదుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సిఎం కెసిఆర్‌ సూచించారు.  రాష్ట్ర నీటిపారుదల శాఖ పనితీరుపై సోమవారం సీఎం కల్వకంట్ల చంద్రశేఖర్‌రావు సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీష్‌ రావు, నీటిపారుదల నిపుణులు విద్యాసాగర్‌ రావుతోపాటు పలువురు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పనుల్లో వేగం పెంచడానికి, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి సీఈ, ఎస్‌ఈ స్థాయి అధికారులకు కూడా అధికారాలను బదలాయించాలని అన్నారు. పాలమూరు-ఎత్తిపోతల, పెన్‌గంగ ప్రాజెక్టుకు వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. రెండు వారాల్లో టెండర్ల పక్రియ పూర్తికావాలని పేర్కొన్నారు. ఉద్దండపూర్‌ పనులకు సంబంధించి సైజులు, డిజైన్లు ఖరారు చేయాలని సూచించారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం బ్యారేజీకి కూడా త్వరలో శంకుస్థాపన చేయాలని అన్నారు. వచ్చే యేడాది జూన్‌ నాటికి కాళేశ్వరం బ్యారేజీ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు చేరేలా పనులు జరిగాలని ఆదేశించారు. పాలమూరు ఎత్తిపోతల, పెన్‌గంగ ప్రాజెక్టులకు వెంటనే టెండర్లు పిలవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. పాలమూరు ఎత్తిపోతలకు రెండువారాల్లో టెండర్ల పక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. పనుల్లో వేగం పెంచేందుకు సీఈ, ఎస్‌ఈ స్థాయివారికి అధికారాలు బదలీ చేయనున్నట్లు తెలిపారు. బడ్జెట్‌లో నీటిపారుదలశాఖకు ప్రతినెలా రూ.2,083 కోట్లు విడుదల చేస్తామన్నారు. వచ్చే జూన్‌ నాటికి కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి నీరు చేరేలా పనులు జరగాలని, అదేవిధంగా డిండి ప్రాజెక్టుకు కూడా త్వరలోనే టెండర్లు పిలవాలని కేసీఆర్‌ ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి నీరు చేరాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు.