త్వరితగతిన ప్రాజెక్టుల పూర్తి

అన్నిరంగాలకు సంక్షేమ ఫలాలు: మంత్రి
నిర్మల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యాన్ని నివారించి సత్వరమే పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని  మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి  అన్నారు.  సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, తలెత్తుతున్న ఇబ్బందులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాణహిత, చేవేళ్ల ప్రాజెక్టులో భాగమైన ప్యాకేజీలను ఎట్టి పరిస్థితుల్లో 2018 నాటికి పూర్తి చేసి నిర్మల్‌, ముథోల్‌ నియోజక వర్గాల్లోని రైతాంగానికి 50వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని ఆదేశించారు. అలాగే నిర్మల్‌, సారంగాపూర్‌, దిలావార్‌పూర్‌, మామడ, మండలాల్లో లిప్టు సిస్టం, పై ప్‌లైన్‌ పనులను వేగవంతం చేయాల్నరు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు సీఎం కేసీఆర్‌ బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారని అన్నారు. చీరలకు వెలకట్టొద్దని, పండుగకు సీఎం కేసీఆర్‌ సోదరుడిలా కానుకగా ఇస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు రాజకీయ పబ్బం కోసమే ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. పాడిపంట బాగుండే ప్రాంతం సుభిక్షంగా ఉంటుందనేది ముఖ్యమంత్రి ప్రగాఢ విశ్వాసం అని  అన్నారు. అన్ని మండలాల గొల్లకుర్మలకు ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేసిందని, మిగిలిన వారికి ఇంకా చేస్తూనే ఉందన్నారు. అయితే గొర్రెలు ఇవ్వగానే సరిపోదని భావించిన సీఎం కేసీఆర్‌ వాటిని కాపాడే బాధ్యతను కూడా తీసుకున్నారని, అందుకే గొర్రెలు కాని, గ్రావిూణ ప్రాంతాల్లోని పశువులకు గాని ఎలాంటి అనారోగ్యం కలిగినా వెంటనే వాటి చికిత్స కోసం ఈ పశువైద్య సంచార అంబులెన్స్‌లను ఏర్పాటు చేయిస్తున్నారని అన్నారు. గ్రావిూణ ప్రాంత రైతులు, గొల్లకుర్మలు ఈ సేవలు ఉపయోగించుకోవాలని, ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే 1962 నెంబర్‌కు ఫోన్‌ చేస్తే అంబులెన్స్‌ అవసరమైన మందులతో ఆ గ్రామాలకు వస్తుందని  చెప్పారు.