త‌మిళ పాలిట్రిక్స్‌: ప‌న్నీర్‌కు షాక్‌..సీఎంగానే ప‌ళ‌ని

త‌మిళ‌రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తీసుకుంటున్నాయి. సీఎం కుర్చీ కోసం ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి ప‌ళ‌ని స్వామి వ‌ర్గం మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వం వ‌ర్గాల మ‌ధ్య చ‌ర్చ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ప్ర‌భుత్వంతో పాటు అన్నాడీఎంకేను న‌డిపించేందుకు ఒక మార్గ‌ద‌ర్శ‌క క‌మిటీని నియ‌మించాల‌నే కొత్త ప్ర‌తిపాద‌న‌ను ప‌ళ‌ని స్వామి వ‌ర్గం తెర‌పైకి తీసుకొచ్చింది. ఈ ప్ర‌తిపాద‌న ప్ర‌కారం ప‌ళ‌నిస్వామినే సీఎంగా కొన‌సాగిస్తూ..మార్గ‌ద‌ర్శ‌క క‌మిటీ బాధ్య‌త‌లు  ప‌న్నీర్ సెల్వంకు అప్ప‌గించాల‌ని యోచిస్తోంది. బుధ‌వారం రాత్రి ఇరువ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ఈ కొత్త ప్ర‌తిపాద‌న తెర‌పైకొచ్చిన‌ట్లు తెలుస్తోంది.

అన్నీ స‌వ్యంగా జరిగితే పార్టీ స‌ర్వ స‌భ్య స‌మావేశం నిర్వ‌హించి మెజార్టీ అభిప్రాయం తీసుకుని అందుకు అనుగుణంగా నిర్ణ‌యం తీసుకోవాల‌ని ప‌ళ‌ని వ‌ర్గం భావిస్తోంది. అయితే విలీనంలో భాగంగా జ‌రిచే చ‌ర్చ‌ల్లో పార్టీ వ‌ర్గాలెవ‌రూ నోరు మెద‌ప‌కూడ‌ద‌ని ఎలాంటి గంద‌ర‌గోళం సృష్టించొద్ద‌ని సెంగొట్ట‌యాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే మ‌రోవైపు అన్నాడీఎంకేకు చెందిన 28 మంది ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఓ హోట‌ల్‌లో మంత్రివ‌ర్గంపై ర‌హ‌స్య మంత‌నాలు జ‌రుపుతుండ‌టం చూస్తుంటే మ‌రోసారి త‌మిళ పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది.