థ్యాంక్యూ ఆంటీ….

హైదరాబాద్‌,నవంబర్‌29 (జ‌నంసాక్షి) : టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా, క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ దంపతులు గత నెలలో మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సానియా తన బాబు ఇజాన్‌పై ఉన్న ప్రేమను, ఇతర విషయాలను ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా తన బిడ్డను చూసేందుకు వచ్చిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధూ, స్క్వాష్‌ ప్లేయర్‌ జోత్స్న చిన్నప్పను ఉద్దేశిస్తూ సానియా సరదా ట్వీట్‌ చేసింది. ముగ్గురూ దిగిన సెల్ఫీని పోస్ట్‌ చేసి తన బిడ్డను చూసేందుకు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపింది. ఇందులో ఇద్దరినీ ‘ఆంటీ’లుగా సంబోధించడం విశేషం. ‘ ఇజాన్‌ను చూసేందుకు వచ్చినందుకు థాంక్యూ ఆంటీ సింధూ.. థ్యాంక్యూ ఆంటీ జేసీ ‘ అని సానియా ట్వీట్‌ చేశారు

తాజావార్తలు