దక్షిణాఫ్రికా రికార్డు విజయం
సిడ్నీ గడ్డపై వెస్టిండీస్ ఘోర పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 257 పరుగుల తేడాతో ఓడిపోయింది. 33.1 ఓవర్లకే అన్ని వికెట్లు కోల్పోయింది. 409 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన విండీస్ 151 పరుగుల దగ్గరే ఆగిపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్ల ముందు విండీస్ దిగ్గజాలు కూడా నిలబడలేకపోయారు. దీంతో, ప్రపంచ కప్ లోనే అతిపెద్ద విజయం రికార్డుని దక్షిణాఫ్రికా సమం చేసింది. 2007లో బెర్ముడాపై భారత్ 257 పరుగుల తేడాతో విజయం సాధించి రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బౌలర్ తాహిర్ ఐదు వికెట్లు తీయగా, మార్క్ వెల్, అబోట్ చెరో రెండు వికెట్లు తీశారు.