దక్షిణ ఫ్రాన్స్‌లో ఘోర విమాన ప్రమాదం
ఆల్ఫ్స్ పర్వతాల్లో కూలిన జర్మన్ ఎయిర్ బస్
సిబ్బంది సహా 148 దుర్మరణం
ఫ్రాన్స్, మార్చి 24: దక్షిణ ప్రాన్స్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. జర్మన్ వింగ్స్ కంపెనీకి చెందిన ఎయిర్ బస్ ఎ-320 విమానం ఆల్ఫ్స్ పర్వత ప్రాంతాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 142 మంది ప్రయాణికులు సహా ఆరుగురు సిబ్బందితో కలిపి మొత్తం 148 మరణించారు. స్పెయిన్‌లోని బార్సిలోనా నుంచి జర్మనీలోని డసెల్ డోర్ఫ్ మధ్య ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆల్ఫ్స్ పర్వత ప్రాంతాల్లో విమాన శకలాలను గుర్తించినట్లు ఫ్రాన్స్ హోంశాఖ ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు రాడార్‌తో విమానం సంబంధాలను కోల్పోయింది. ఆ తరువాత కొద్ది సేపటికే ఎయిర్ బస్ కూలిపోయినట్లు తేలింది. ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకోని ఉండొచ్చని ఫ్రాన్స్ అధికారులు భావిస్తున్నారు.