దత్తాత్రేయ ఇంటిని ముట్టడించిన ఏఐఎస్‌ఎఫ్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై పలు విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై బుధవారం రాంగనగర్‌లోని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంటిని ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థులు ముట్టడించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా, హెచ్‌సీయూలో సస్పెన్షన్కు గురైన పీహెచ్‌డీ విద్యార్థి, గుంటూరుకు చెందిన వేముల రోహిత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.